రైతులకు నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలి:ఎమ్మెల్యే

రైతులకు నీటి ఎద్దడి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.సోమవారం మోతె మండల పరిషత్ కార్యాలయంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోతె మండలంలో ఆయకట్టు కింద ప్రతి ఎకరాకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

 Measures Should Be Taken To Prevent Drinking Water Shortage,drinking Water Short-TeluguStop.com

ఆయకట్టులో ఏ గ్రామాలకు నీరు అందడం లేదో పరిశీలించి,నీరు అందేవిధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.అధికారులు సమన్వయంతో పని చేసి,రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.

రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానన్నారు.చీఫ్ ఇంజనీర్ తో ఫోన్లో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించారు.

అనంతరం ఆయా గ్రామాలకు సంబంధించిన కళ్యాణ్ లక్ష్మి చెక్కులను లబ్దారులకు పంపిణీ చేశారు.ఈ సమావేశంలో ఎస్సారెస్పీ అధికారులు రమేష్,ఏఈ లింగయ్య, ఎమ్మార్వో యాదగిరి, ఎంపీడీవో చారి,టిఆర్ఎస్ నాయకులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube