నిన్ను చూడాలని సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కెరీర్ ను మొదలుపెట్టినా స్టూడెంట్ నంబర్ వన్ సినిమాతో మాత్రమే తారక్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు.ఈ సినిమాతోనే దర్శకునిగా రాజమౌళి ప్రయాణం కూడా మొదలైంది.
అయితే ఈ సినిమా షూట్ సమయంలో హీరో సెలెక్షన్ కు సంబంధించి రాజమౌళి పూర్తిస్థాయిలో సంతృప్తితో లేరు.స్టూడెంట్ నంబర్ 1 సెట్ లో ఎన్టీఆర్ ను చూసి నిరుత్సాహపడ్డానని ఆయన ఒక సందర్భంలో కామెంట్ చేశారు.

ఈ సినిమాకు ఓకే చెప్పి ఇరుక్కుపోయానా అని కూడా అనిపించిందని ఓరి దేవుడో వీడు దొరికాడు ఏంట్రా అని అనుకున్నానని కూడా రాజమౌళి పేర్కొన్నారు.ఆ సినిమా షూట్ సమయంలో తారక్ తో సాన్నిహిత్యం ఏర్పడిందని జక్కన్న అన్నారు.అయితే అప్పుడు ఈ విధంగా కామెంట్ చేసిన జక్కన్న ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ ను ప్రశంసిస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఆర్.ఆర్.ఆర్ మూవీలో ఇంట్రడక్షన్ సీన్ షూట్ చేసే సమయంలో యాక్షన్ కొరియోగ్రాఫర్ చూపించిన దాని కంటే ఎన్టీఆర్ మరింత వేగంతో పరుగెత్తాడని ఎన్టీఆర్ అంత వేగంగా పరుగెత్తడంతో కెమెరాలో క్యాప్చర్ చేయడం కూడా కష్టమైందని రాజమౌళి తెలిపారు. యాక్టింగ్ తో పాటు ఫిట్ నెస్ విషయంలో కూడా తారక్ పర్ఫెక్ట్ అని ఆయన అన్నారు.రాజమౌళి ఎన్టీఆర్ ను ప్రశంసించడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.
అమెరికాకు బయలుదేరిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అక్కడ ఎలా సందడి చేస్తారో చూడాల్సి ఉంది.ఆర్.ఆర్.ఆర్ సినిమా ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకోగా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ కూడా వస్తే మాత్రం మామూలుగా ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి.రాజమౌళి తారక్ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.







