జిల్లాలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోనే అత్యధిక వర్ష పాతం నమోదైన మండలంగా అనంతగిరి మండలం( Anantagiri ) ఉన్నట్లు అధికారులు తెలిపారు.మండల పరిధిలోని ఎన్నడూ లేని విధంగా శాంతినగర్ లో 72.5,గొండ్రియాల 70.5 వర్షపాతం నమోదై తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి,రెండవ స్థానాల్లో నిలిచాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.అనంతగిరి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు,వంకలు, చెరువులు పొంగిపోర్లే అవకాశముందని, పురాతన భవనాల్లో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
Latest Suryapet News