అనంతగిరి మండలంలో అత్యధిక వర్షపాతం నమోదు…!
TeluguStop.com
జిల్లాలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోనే అత్యధిక వర్ష పాతం నమోదైన మండలంగా అనంతగిరి మండలం( Anantagiri ) ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మండల పరిధిలోని ఎన్నడూ లేని విధంగా శాంతినగర్ లో 72.5,గొండ్రియాల 70.
5 వర్షపాతం నమోదై తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి,రెండవ స్థానాల్లో
నిలిచాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
అనంతగిరి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు,వంకలు, చెరువులు పొంగిపోర్లే అవకాశముందని, పురాతన భవనాల్లో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.