ప్రజా ఉద్యమాలకు సూర్యాపేట పెట్టింది పేరు:మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:ప్రజా ఉద్యమాలకు సూర్యాపేట పెట్టింది పేరు అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.ప్రతీ ఉద్యమం వెనుక వ్యాపార వర్గాలు కీలక పాత్ర వహించారని ప్రశంశించారు.

 The Name Of Suriyapeta For Public Movements: Minister Jagadish Reddy-TeluguStop.com

నాటి నైజాం పాలనకు వ్యతిరేకంగా ఈ గడ్డ మీద నుండే పోరాటం ప్రారంభం అయిందన్నారు.ఆ పోరాటం వెనుక ముఖ్య భూమిక పోషించింది వ్యాపార వర్గాలే ఆన్న నగ్న సత్యాన్ని విసనరించారదన్నారు.

శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య ప్రముఖులతో ఇష్టా గోష్టిగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి( Minister Jagdish Reddy ) మాట్లాడారు.వ్యాపారంతో పాటు సమాజ సేవలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్న వర్తక వ్యాపార వర్గాలు నాటి తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం మొదలు,నిన్నటి వేరు తెలంగాణా ఉద్యమాలకు ఊపిరి లూదారని గుర్తుచేశారు.

నైజం పాలనకు వ్యతిరేకంగా పోరాటం మొదలైంది సూర్యాపేట లోనేనని,అది కుడా వర్తక వ్యాపార వాణిజ్య వర్గాల ప్రోత్సాహంతోటేనని తెలిపారు.

ఆ తరువాత జరిగిన 1969 తెలంగాణా తోలి దశ ఉద్యమం మొదలు,1972 లో జరిగిన జై ఆంద్రా ఉద్యమానికి వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలైంది కుడా చైతన్యానానికి మారు పేరుగా నిలిచిన సూర్యపేట నుండేనని అన్నారు.

ఆ తరువాత క్రమంలో 1998 ప్రాంతంలో ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై తెలంగాణా జనసభ పేరుతో వేరు తెలంగాణా ఉద్యమానికి( Telangana movement ) ఊపిరిలూదిన నేల కుడా సూర్యాపేటేనని చెప్పారు.అటువంటి గడ్డ మీద నుండే బహుబందాలను దూరం చేసుకొని బొమ్మగాని ధర్మభిక్షం,ఆస్తి పాస్తులను వదులు కొని భీమిరెడ్డి నరసింహా రెడ్డి, నిజాయితీకి ప్రతిబింబంగా నిలిచిన ఉప్పల మల్సూర్ లు సూర్యాపేట( Suryapeta ) బిడ్డలు కావడం మనం గర్వపడే అంశమన్నారు.

అటువంటి మహనీయుల స్ఫూర్తి వర్తమానానినికి అందించాల్సిన గురుతర బాధ్యత మనందరి మీద ఉందన్నారు.ఎక్కడ కుడా ఆర్యవైశ్యులు వ్యాపారానికే పరిమితము కాలేదని,వారి ప్రొత్సహంతోటే ఉద్యమాలు సాగాయని గుర్తుచేశారు.

మొన్నటికి మొన్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో బాలభవన్ ఏర్పడిందంటే అది ముమ్మాటికి వనమా వెంకట్రామయ్య గొప్పతనమేనని కొనియాడారు.అటువంటి వారిని స్మరించుకునేందుకే ఈ నెల 16 న సూర్యాపేట జిల్లా కేంద్రంలో సేవాంకిత సభను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

వనమా వెంకట్రామయ్య, గుండా వెంకటప్పయ్యల ను స్మరించుకోవడంతో పాటు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించిన కేసి గుప్తా విగ్రహం రోడ్ల విస్తరణతో పక్కకు పోయినందున అదే రోజు పునరుద్ధరణ ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో మీలా మహాదేవ్,మొరిశెట్టి శ్రీనివాస్,ఉప్పల ఆనంద్,తోట శ్యామ్, బండారు రాజా,రాచర్ల కమలాకర్,మీలా వంశీ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లలితా ఆనంద్, గుండా శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube