సూర్యాపేట జిల్లా:జిల్లాలో ఈ నెల 12 న నిర్వహించే టెట్ పరీక్షను పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ,అనుబంధ శాఖల అధికారులతో టెట్ నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావుతో కలసి పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని,నియమించిన అధికారులు మౌలిక వసతులన్ని కేంద్రాలలో కల్పించాలని సూచించారు.తేదీ:12.06.2022 న ఉదయం 09:30 గం.నుండి మధ్యాహ్నము గం.12:00 ల వరకు పేపర్-1 అలాగే మధ్యాహ్నము గం.02:30 ల నుండి సాయంత్రం గం.05.00 ల వరకు పేపర్-॥ లు నిర్వహించబడునని అన్నారు.ఇట్టి పరీక్ష నిర్వహణ కొరకు రూట్ ఆఫీసర్ & ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలకు,చీఫ్ సూపరింటెండెంట్ మరియు డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు పరీక్ష నిర్వహణపై ఇవ్వడం జరిగిందని అన్నారు.
సిబ్బంది ఒక రోజు ముందుగా తమ పరీక్షా కేంద్రము నందు అన్నీ మౌళిక వసతులను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యంగా త్రాగునీరు,నిరంతర విద్యుత్,మెడికల్ కిట్స్ అన్ని కేంద్రాలలో ఏర్పాటు చేయడంతో పాటు పరీక్షా కేంద్రాలలో సిసి కెమెరాలు అమర్చాలని, అందుబాటులో ఉంచాలని సూచించారు.నియమించిన అధికారులు సమన్వయంతో కలసి పనులు చేయాలని అన్నారు.
పరీక్షలు సజావుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు.పరీక్షల సందేహాల కొరకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయము నందు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడినదని అన్నారు.
ఈ కార్యక్రంలో జిల్లా రెవెన్యూ అధికారి రాజేంద్రకుమార్,జిల్లా విద్యా శాఖాధికారి అశోక్, అసిస్టెంట్ కమీషనర్ (పరీక్షలు),తహశీల్దార్లు,విద్యా శాఖ అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.