సామాన్య భక్తులకు దక్కని సైదన్న దర్శనం...!

సూర్యాపేట జిల్లా: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన జాన్ పహాడ్ సైదులు నామ దర్గా… నేడు ఆధ్యాత్మిక వ్యాపార కేంద్రంగా మారి ఏటేటా తన అస్థిత్వాన్ని కోల్పోతూ ఉందని భక్తులు బాధను వ్యక్తం చేస్తున్నారు.దర్గా దర్శనానికి వచ్చే భక్తుల నుండి నిలువు దోపిడీ చేస్తూ సామాన్య భక్తులకు సైదన్న దర్శనమే భాగ్యమయాయేలా చేస్తున్నారని అవేదన చెబుతున్నారు.

 Common Devotees Facing Problems At Jan Pahad Saidulu Dargah, Devotees , Jan Paha-TeluguStop.com

వివరాల్లోకి వెళితే…

సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ లోని సైదులు దర్గా ముస్లిం మత సంప్రదాయాలకు అనుగుణంగా కొలువై ఉన్నప్పటికీ సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచింది.ప్రతి శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కందూరు రూపంలో తమ మొక్కులు తీర్చుకుంటారు.

నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ దర్గాలో మొక్కులు తీర్చుకొనేందుకు వచ్చిన భక్తులను యాట పోతుల హాలాల్,వాహన పూజ, లడ్డూల పేరుతో భక్తులను నిలువునా దోచేస్తున్నారు.అయితే ఈ ధరలు గత ఏడాది కంటే రెండు రెట్లు ఎక్కువ పెంచి వసూలు చేస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు.దర్గాలోనికి వెళ్లాలంటే రూ.700, వెళ్ళినాక రూ.1100 చెల్లించవలసి వస్తుందని భక్తులు వాపోతున్నారు.దర్గా ఆవరణంలో ప్రతి షాప్ నుండి గుత్తేదారులు రూ.100 వసూల్ చేస్తున్నారని,ద్విచక్ర వాహన పూజకి రూ.1016, ఇక భారీ వాహనాలైతే రూ.5 వేలకు పైనే వసూలు చేస్తున్నట్లు వాహనదారులు చెబుతున్నారు.దర్గా దర్శనానికి వచ్చి వెళ్లే వరకు దర్గాలో వివిధ కారణాలు చెప్పి భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని వేలల్లో వసూల్ చేస్తూ నాణ్యతలేని లడ్డు ప్రసాదంతో భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.దర్గాలో జరుగుతున్న అక్రమ వసూళ్లపై పలుమార్లు జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని అంటున్నారు.

జాన్ పహాడ్ దర్గాలో గుత్తేదారుల దోపిడి…

జాన్ పహాడ్ సైదులు దర్గా తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ఆధీనంలో నడుస్తుంది.గుత్తేదారుల బహిరంగ వేలం ద్వారా టెండర్ వేయాల్సి ఉంటుంది.కరోనా సమయంలో తము ఆశించిన మేరకు ఆదాయం రాలేదనే సాకుతో గుత్తేదారులు బోర్డు నిబంధనలు తుంగలో తొక్కి దర్గా దర్శనానికి వచ్చే భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గుత్తేదారుల టెండర్ లో యాట పోతుల హాలాల్, వాహన పూజ,పాయితాల్ కీ భక్తుల నుండి ఎంత తీసుకోవాలనే ధరలు కేటాయించకపోవడంతో గుత్తేదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి భక్తులకు తెలిసేలా ధరలు పట్టిక ఏర్పాటు చేసి అక్రమ వసూళ్ల నుండి భక్తులను కాపాడాలని కోరుతున్నారు.

ఎమ్మెల్యే ఐటీ శాఖ మంత్రి హామీలు నెరవేరైనా సామీ…!

ఈ ఏడాది జనవరిలో జరిగిన ఉర్సు ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి సైదులు దర్గా అభివృద్ధికి అనేక హామీలు ఇచ్చారు.భక్తులకు ఇబ్బందులు కలగకుండా దర్గా ధరల పట్టిక ఏర్పాటు చేయాలని బోర్డ్ అధికారులకు సూచించారు.

అయినా నేటికీ హామీలతో పాటు ఆదేశాలు కూడా అమలు కాలేదు.ఐటి పురపాలక శాఖ మంత్రి హుజూర్ నగర్ వచ్చిన సందర్భంగా దర్గా అభివృద్ధికై పలు హామీలు ఇచ్చినా ఇప్పటి వరకూ అమలుకు నోచుకోలేదు.

ఉర్సు ఉత్సవాలకు వచ్చే భక్తులకు దర్గా అభివృద్ధికై ప్రభుత్వం నుండి 50 లక్షలు మంజూరు చేశారు.అభివృద్ధి పనులు మాత్రం ప్రారంభం కాలేదు.

వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మహముద్…

టెండర్ లో ఉన్న ఐటమ్స్ కి ధరలు ఫిక్స్ చేసి దర్గా ఆవరణంతో పాటు ప్రధాన కుడలిలో ధరల పట్టిక బోర్డులు ఏర్పాటు చేసే విధంగా ఉన్నత అధికారులకు నివేదిక పంపిస్తున్నాం.ఫిర్యాదు చెయ్యవలసిన అధికారుల ఫోన్ నెంబర్లు కుడా ఉంటాయి.

టెండర్ లో కాకుండా దర్గా పరిసర ప్రాంతాల్లో జీవనోపాధి కోసం భక్తులను వేధిస్తున్నట్లు తెలుస్తోంది.అలా జరిగితే చర్యలు ఉంటాయి.

దర్గా అభివృద్ధికై ప్రభుత్వం నుండీ వచ్చిన 50 లక్షల నిధుల ప్రణాళికలు రెడీ చేస్తున్నారు.త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి.

గత వారం రోజులుగా వస్తున్న వార్త కథనాలపై విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube