ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల తీవ్రమైన వ్యాధులు ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఇలాంటి తీవ్రమైన వ్యాధులలో ఎయిడ్స్ వ్యాధి ఒకటి.
చాలామంది ప్రజలలో ఎయిడ్స్ అనే పేరు వినగానే ఏక్కడ లేని భయం కలుగుతుంది.అంత ప్రమాదకరమైన ఎయిడ్స్ రోగానికి దూరంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలను కచ్చితంగా తీసుకోవాల్సిందే.
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన జరుపుకుంటారు.ఈ ఎయిడ్స్ దినోత్సవం రోజున ప్రజలలో ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించడానికి ఈరోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు.
ఎయిడ్స్ వ్యాధి భారీన పడిన వ్యక్తిలో కనిపించే లక్షణాలు ఇలా ఉంటాయి.హెచ్ఐవి వ్యాధిలో చివరి దశనే ఎయిడ్స్ అని అంటారు.
ఈ దశలో జ్వరం శోభ రస కనుకుల వాపు, నీరసం, రాత్రి పూట అధికంగా చెమట పట్టడం, నోరూ, నాలుక పై చిన్నచిన్న పుండ్లు రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.ఇంకా చెప్పాలంటే ఎయిడ్స్ బయటపడిన తర్వాత ఆ వ్యక్తి మూడు సంవత్సరాలు మాత్రమే జీవించే అవకాశం ఉంది.
ఎయిడ్స్ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలను కచ్చితంగా పాటించాల్సిందే.ఒకరితో కాకుండా ఎక్కువమంది భాగస్వాములు ఉన్న వ్యక్తులు మాత్రమే కాకుండా ఒకే భాగస్వామితో అసురక్షిత లైంగిక సంబంధం కలిగి ఉన్న వ్యక్తి కూడా ఎయిడ్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
సెక్స్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలను కచ్చితంగా తీసుకోవాలి.

హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన వ్యక్తితో మీరు పదేపదే అసురక్షిత రతిలో పాల్గొంటే కచ్చితంగా ఎయిడ్స్ బారిన పడే అవకాశం ఉంది.కండోమ్ నాణ్యతలేని వాటిని వాడితే కచ్చితంగా ఈ భయంకరమైన వ్యాధి వచ్చే అవకాశం ఉంది.ఇంకా చెప్పాలంటే పచ్చబొట్లు వేయించుకోవడం యువతలో ఈరోజుల్లో ఒక ఫ్యాషన్ గా మారింది.
ఈ పచ్చబొట్లు వేయించుకునే వారిలో ఎవరికైనా హెచ్ఐవి పాజిటివ్ ఉంటే ఆ సూదిని ఉపయోగించడం వల్ల కూడా హెచ్ఐవి పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.అందుకే ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలు పెళ్లికి ముందే హెచ్ఐవి పరీక్షను చేయిస్తున్నారు.