సూర్యాపేట జిల్లా: కేంద్రంలోని మెయిన్ రోడ్డు పక్కన శుక్రవారం జరిగిన హృదయ విదారక యథార్థ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ డాక్టర్ బంటు కృష్ణ అందిస్తున్న కన్నతల్లి ఆప్యాయత అనురాగాలకు సంబంధించిన మానవీయ వాస్తవ సంఘటన ఆధారంగా సూర్యాపేట తాళ్లగడ్డ ప్రాంతంలో ఆయుష్మాన్ భారత్ కార్డుల ప్రక్రియ కొనసాగుతున్న వేళ రాత్రి 8 గంటల ప్రాంతంలో ఒక కుక్క పిల్ల చనిపోయింది.
పక్కనే ఫుట్పాత్ మీద ఉన్న చనిపోయిన కుక్కపిల్లను కొందరు అటు పక్కనే ఉన్న మ్యాన్ హోల్ గుంతలో వేశారు.ఈ విషయాలను దూరం నుంచి గమనిస్తున్న చనిపోయిన కుక్క పిల్ల తల్లి తన కన్న బిడ్డ ఇంకా బతికి ఉందని ఆశతో తన మరో పిల్లతో కలిసి గుంతలో పడిపోయిన కుక్కపిల్లను పైకి లాగటానికి చాలా సార్లు ప్రయత్నించడం జరిగింది.
ఇదే సమయంలో అక్కడ ఉన్న మరికొన్ని కుక్కలు చనిపోయిన కుక్క పిల్ల వైపు ఆభగా వస్తుండడంతో కన్నతల్లి కుక్క వాటిని అరుస్తూ తరమడం మళ్లీ తన పేగు బంధం కోసం ఆరాటపడుతూ గుంత వద్దకు రావడం ఈ కుక్క తల్లితోపాటు మరో కుక్క కూన కూడా తన తోడును చూడడానికి తల్లి వెంట రావడం చూపరులను కంటతడి పెట్టించింది.అక్కడ గుమ్మిగూడి ఉన్న జనం మాత్రం తమ పనుల్లో లీనమై ఉన్నారు.
ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన జర్నలిస్టు కృష్ణ తల్లి ఆరాటాన్ని కెమెరాలో బంధిస్తూ కుక్కపిల్లను చనిపోయినప్పటికీ తల్లి వద్దకు చేర్చడం కొసమెరుపు.ఈ ప్రకృతిలో అజ్ఞాని అయినా విజ్ఞాని అయినా మనిషైనా జంతువైన కన్నతల్లి పేగు బంధానికి విలువనిచ్చి జన్మజన్మలకు రుణపడి ఉండటం ఇంతేమీ కాదు కదా.ప్రేమ పేగు బంధం ఎవరికైనా ఒకటే కదా.ప్రపంచంలో కన్నతల్లి పేగు బంధానికి విలువనిచ్చే కాపాడే ప్రతి బిడ్డ తన మాతృమూర్తులకు తప్పకుండా మరోసారి మనస్ఫూర్తిగా వందనాలు సమర్పించుకోవాల్సిందే.అమ్మ నీకు వందనం.కన్నతల్లి నీకు పాదాభివందనం మాతృమూర్తులారా మరోసారి అభివందనం
.