గూగుల్ ఫోటోల ఎడిటింగ్ కోసం సరికొత్త ఫీచర్..!

గూగుల్ ఫోటోలను( Google Photos ) ఎడిటింగ్ చేయడం కోసం గత సంవత్సరంలో క్రోమ్ బుక్స్( Chrome Books ) కి కొత్త మూవీ ఎడిటింగ్ టూల్స్ అందించాలని గూగుల్ నిర్ణయించుకుంది.ప్రస్తుతం ఆ ఫీచర్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.

 A New Feature For Editing Google Photos , Google Photos, A New Feature, `theme ,-TeluguStop.com

ఇక వినియోగదారులు కేవలం కొన్ని క్లిక్ ల ద్వారా వీడియోలను, మూవీలను సృష్టించవచ్చు లేదా ఎడిటింగ్ చేయవచ్చు.గూగుల్ ఫోటోలను అదే యాప్ లో ఎడిట్ చేసే సరికొత్త ఫీచర్ ను విడుదల చేస్తున్నట్లు గూగుల్ ఫోటోల కమ్యూనిటీ పేజీలో ఒక ప్రకటనను కంపెనీ ప్రచురించింది.

ఈ ఫీచర్ వినియోగదారులకు చాలా ఉపయోగపడుతుందని కంపెనీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.ఈ కొత్త మూవీ ఎడిటర్ ఫీచర్ లో రెండు ఆప్షన్లు ఉన్నాయి.

మొదటి ఆప్షన్ ద్వారా మూవీని సృష్టించవచ్చు లేదంటే ముందుగా సెట్ చేయబడిన థీమ్ ను ఎంచుకోవచ్చు.మూవీని సృష్టించాలంటే గ్యాలరీలో ఉండే ఏదైనా ఒక వీడియోను ఎంచుకుని, అంతర నిర్మిత ఎడిటర్ సహాయంతో ఫోటోలు లేదా వీడియోలను సరి చేసుకునే అవకాశం ఉంటుంది.

ఒకవేళ ముందుగానే సూచించబడిన థీమ్ ను ఎంచుకున్నట్లయితే ఫీచర్ ఎంచుకున్న థీమ్ ఆధారంగా ఆటోమేటిక్గా వీడియోలు మరియు ఫోటోలను ఎంపిక చేసుకోవచ్చు.ఈ ఫీచర్ తో ఇలాంటి ఆప్షన్లను ఎలా కావాలంటే అలా మార్చుకోవడం లేదా ఎలా కావాలంటే అలా సవరించుకునే అవకాశం ఉంటుంది.

అయితే మనకు ముందుగా మూవీ ఎడిటర్ నిర్మాణం చిక్కుల గురించి కాస్తయినా తెలిసి ఉండడం అవసరం.లాప్టాప్ లలో ప్రొఫెషనల్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ తో పని లేకుండానే అధిక నాణ్యత గల వీడియోను సృష్టించవచ్చు.

గూగుల్ వినియోగదారుల ముందుకు తీసుకొచ్చిన ఈ మూవీ ఎడిటర్ ఫీచర్ యాక్సెస్ చేసుకోవడానికి ముందుగా క్రోమ్ బుక్ లో గూగుల్ ఫోటోల యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి.ఈ ఫీచర్ గూగుల్ ఫోటోల వీడియో క్లిప్ లు మరియు ఫోటోలు ఉపయోగించి అనుకూలమైన మూవీ ని సృష్టిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube