సూర్యాపేట జిల్లా:అర్హులైన నిరుపేదలంతా దరఖాస్తు ఫారాన్ని ఒకటికి రెండుసార్లు చదివి పూరించాలని,ఎవరికి ఏ పథకం వర్తిస్తుందో చూసుకొని అర్హతను బట్టి దరఖాస్తు చేసుకోవాలని హుజూర్ నగర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి( Jagadishwar Reddy ) సూచించారు.గురువారం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం గుండెబోయినగూడెంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్, ఎంపిపితో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈసందర్భంగా ప్రజల నుంచి వస్తున్న దరఖాస్తులను పరిశీలించి మాట్లడుతూ దరఖాస్తుల స్వీకరణకు జనవరి 6వరకు సమయం ఉందని, అందరూ విధిగా తమకున్న అర్హతను బట్టి దరఖాస్తు చేసుకోవాలని, వివిధ కారణాల వల్ల ప్రస్తుతం ఇవ్వలేనివారు ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తర్వాత తీసుకుంటామని చెప్పారు.
అనంతరం ఎంపీపీ గోపాల్ నాయక్( MPP Gopal Naik ) మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు.
పథకాలపై ఎలాంటి అపోహలు వద్దన్నారు.కార్యక్రమ అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలను విజిట్ చేసి రికార్డులను పరిశీలించారు.పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీదేవి,మండల ప్రతేక అధికారి శంకర్,ఎంపీఓ దయాకర్,ఏపీవో రాజు,గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.