బాసటగా పోలీసు భద్రత స్కీమ్

సూర్యాపేట జిల్లా:జిల్లా ఆర్ముడ్ రిజర్వ్ నందు హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న కోటిరెడ్డి అనారోగ్యంతో ఆకాలంగా మృతి చెందారు.మృతి చెందిన కోటిరెడ్డి కుటుంబ సభ్యులకు పోలీసు భద్రత ఇస్యూరెన్స్ స్కీం ద్వారా 8 లక్షల నగదు చెక్కును జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ బుధవారం అందజేశారు.

 Basataga Police Security Scheme-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖలో పని చేస్తూ అకాల మరణం పొందిన సిబ్బంది కుటుంబాలను తెలంగాణ పోలీసు శాఖ అన్ని విధాలుగా అదుకుంటుందన్నారు.దివంగత సిబ్బంది కుటుంబాలకు పోలీసు భద్రత స్కీమ్ బాసటగా నిలుస్తుందని,కోటిరెడ్డి కుటుంబం యొక్క సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ గోవిందరావు,జిల్లా పోలీసు సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్,సెక్రెటరీ వెంకన్న,సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

2012 బ్యాచ్ కానిస్టేబుల్స్ దాతృత్వం సూర్యాపేట టౌన్ పీఎస్ లో పని చేస్తున్న 2012 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ వీర ప్రసాద్ అకాల మరణం చెందడంతో వీర ప్రసాద్ కుటుంబానికి 2012 బ్యాచ్ కానిస్టేబుల్స్,పోలీస్ స్టేషన్ సిబ్బంది తమవంతుగా ఆర్థిక సహాయం అందించి వారి దాతృత్వం చాటుకున్నారు.2012 బ్యాచ్ కానిస్టేబుల్ సిబ్బంది అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తలాకొంత జమచేసి 3 లక్షల రూపాయల చెక్కును ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా వీర ప్రసాద్ కుటుంబ సభ్యులకు చెక్కును అందించారు.ఈ సందర్భంగా సిబ్బంది యొక్క ఆలోచనను,దాతృత్వంను జిల్లా ఎస్పీ అభినందించారు.

ఈ కార్యక్రమంలో పోలీసు సంఘం ప్రెసిడెంట్ రామచందర్ గౌడ్,సెక్రెటరీ వెంకన్న,2012 బ్యాచ్ స్నేహితులైన గుండాల సతీష్,తంగళ్ళపల్లి జనార్ధన్,బాలకృష్ణ,అఖిల్,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube