అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి...?

సూర్యాపేట జిల్లా( Suryapet ) కేంద్రంలోని 18 వార్డు సుందరయ్య నగర్ లో గురువారం తెల్లవారు జామున ఆకారపు శేఖర్(37) అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు.పెయింటర్ గా జీవనం సాగిస్తున్న శేఖర్ సుందరయ్య నగర్ లో అర్ధరాత్రి వివాహనికి హాజరై బయటకు వచ్చాడని,ఆ సమయంలో ఎవరెనా హత్య చేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు.

 Person Died Under Suspicious Circumstances In Suryapet,suryapet,suspicious Circu-TeluguStop.com

రోడ్డుపై బీరు సీసాలు( Beer Bottles ) పగిలి ఉండటంతో అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు.వేరే ప్రాంతంలో హత్యచేసి ఇక్కడ పడేశారా?సంఘటనా స్థలంలోనే హత్య జరిగిందా? ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా అకాల మరణం చెందాడా?అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.సంఘటనా స్థలానికి చేరుకున్న సూర్యాపేట డిఎస్పీ నాగభూషణం, పట్టణ సిఐ రాజశేఖర్ పరిస్థితిని పరిశీలించారు.మృతుడు శేఖర్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు.

మృతుడికి భార్య నలుగురు ఆడపిల్లలు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube