చివ్వెంల మండలంలో చిరుత టెన్షన్...!

చివ్వెంల మండలం బి.చందుపట్ల గ్రామ పరిసరాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మండల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

 Cheetah Tension In Chivvenla Mandal , Chivvenla Mandal, Bodapatla Errayya-TeluguStop.com

కానీ,అది చిరుత పులి కాదు హైనా అని ఫారెస్ట్ అధికారులు తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్న ఘటన శనివారం కలకలం రేపింది.ఫారెస్ట్ అధికారుల కథనం ప్రకారం బి.చందుపట్ల గ్రామానికి చెందిన బోడపట్ల ఎర్రయ్య( Bodapatla Errayya ) శనివారం తెల్లవారు జామున తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లగా చిరుతపులి కనిపించిందని స్థానిక ఎంపీటీసీ కోడి బండ్లయ్యకు చెప్పగా,వెంటనే జిల్లా ఫారెస్ట్ అధికారులకి,చివ్వెంల పోలీస్ స్టేషన్లకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.వెంటనే స్పందించిన ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఆనవాలు,పాదముద్రలను గుర్తించి ల్యాబ్ కి పంపారు.

ఈ సందర్భంగా జిల్లా ఫారెస్ట్ అధికారి సతీష్ మాట్లడుతూ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, బి.చందుపట్ల గ్రామంలో శనివారం పులి సంచరిస్తున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు.ఆనవాలు గుర్తించిన పాదాల గుర్తులు ల్యాబ్ కు పంపించడం జరిగిందని,హైనా గా నిర్ధారణ అయిందన్నారు.ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube