లింగనిర్ధారణ పరీక్షలు,అబార్షన్లు చట్టరీత్యా నేరం

సూర్యాపేట జిల్లా: పుట్టబోయేది ఆడబిడ్డా, మగ బిడ్డా అని తెలిసే పరీక్షలు చేసినా,చేసి ఆడపిల్లని తెలుసుకొని అబార్షన్లు చేసినా చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెంకట్రావ్( Collector Venkatrao ),ఎస్పీ రాహుల్ హెగ్డే హెచ్చరించారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో గర్భధారణ పూర్వ మరియు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ ప్రక్రియ నిషేధ చట్టంపై సమీక్షించారు.

 Gender Determination Tests, Abortions Are Criminalized By Law-TeluguStop.com

జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ మాట్లడుతూ చట్టంపై అధికారులు అందరూ విస్తృతంగా జిల్లాలో అవగాహన కల్పించాలన్నారు.వైద్యశాఖ అధికారులే కాకుండా డివిజన్ల ఆర్డీవోలు కూడా వారి పరిధిలో నిర్వహిస్తున్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లను విరివిగా తనిఖీ చేయాలని ఆదేశించారు.జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య సభ్యులకు జిల్లా గ్రామీణాభివృద్ధి మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

జిల్లా విద్యాధికారుల సహకారంతో పాఠశాలలు, ఇంటర్,డిగ్రీ,వైద్య కళాశాలలో మరియు కేజీబీవీ పాఠశాలల్లో ఈ చట్టంపై అవగాహన కల్పించాలన్నారు.ప్రజలు ఎక్కడైతే సమూహంగా ఉన్నచోట చట్టం యొక్క ప్రాముఖ్యత,ప్రాధాన్యత పై ప్రచార సామాగ్రి, కళాజాతతో ప్రచారం చేయాలన్నారు.

డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు పాల్గొని ఈ చట్టాన్ని అమలు చేయాలన్నారు.జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ ఆడపిల్లలకు మరియు స్త్రీలకు ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలపై,చట్టాలపై ప్రచారం చేయాలన్నారు.

ఎవరైనా చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా,అబార్షన్లు చేసినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.

పోలీసు సహకారంతో గ్రామాల్లో ఆర్ఎంపీలకు అవగాహన కల్పిస్తామన్నారు.జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం జిల్లాలో ఈ చట్టంపై నిర్వహిస్తున్న కార్యక్రమాలపై,తీసుకున్న చర్యలపై వివరించారు.జిల్లాలో ప్రతి 1000 మంది బాలురకు 907 మంది బాలికలు మాత్రమే ఉన్నారని,ఈ పరిస్థితి ఆందోళన కలిగిస్తుందని, ఆడపిల్లలని కనాలని, ఎదగనివ్వాలని, చదివించాలని ఆయన కోరారు.

ఇండియన్ రెడ్ క్రాస్ చైర్ పర్సన్ ఇరుగు కోటేశ్వరి మాట్లాడుతూ ఈ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని,మా సంస్థ తరఫున మా ప్రతినిధులు పాల్గొని సహకారం అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ సతీష్ కుమార్,ఆర్డీవోలు కోదాడ సూర్యనారాయణ, హుజూర్ నగర్ శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మసూద్ రాజు,వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ పి.వెంకటరమణ,డాక్టర్ జయ శ్యామసుందర్,డాక్టర్ నాజియా,డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మరియు జిల్లా మీడియా అధికారి అంజయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube