విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఎవరు బలి కావాలి...?

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండల పరిధిలోని వెంకట్రామపురం గ్రామ శివారులోని అప్పయ్య అనే రైతు పొలంలో రెండు రోజుల క్రితం వచ్చిన ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాల వైర్లు తెగి పొలాల్లో పడ్డాయి.దీనితో రైతులు పొలాల దగ్గరకు వెళ్ళాకంటే భయ పడుతున్నామని,మరో వైపు విద్యుత్ సరఫరా లేక మోటర్లు నడవక వరి పొలలు ఏండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

 Who Should Be The Victim Of Negligence Of Electricity Authorities, , Negligence-TeluguStop.com

గాలి వానకు తెగిపడ్డ విద్యుత్ వైర్లను రెండు రోజులైనా పునరుద్ధరించకుండా సంబంధిత లైన్మెన్, విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి మూగజీవులు,మనుషుల ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడిందని,ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులని వాపోయారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకొని స్తంభాలపై వైర్లు అమర్చాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube