వైరల్ వీడియో: పట్టపగలే దారుణం.. నడిరోడ్డుపై మత్తుమందు ఇచ్చి మహిళ కిడ్నాప్..

ప్రస్తుతం ప్రపంచంలో రాత్రి పగలు అని తేడాలవకుండా దారుణమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ఇటీవలే పట్టపగలే బంగారు షాపులో ఇద్దరు వ్యక్తులు దోపిడీకి పాల్పడిన ఘటన మరవక ముందే.

 After The Viral Video Came To Light, A Woman Was Kidnapped On The Road After Bei-TeluguStop.com

తాజాగా పట్టపగలు ఒక మహిళను కిడ్నాప్ చేసిన సంఘటన పూణే నగరంలో చోటుచేసుకుంది.పట్టపగలే ఇలాంటి దారుణమైన సంఘటన జరిగినా కూడా అక్కడివారు ఎవరు స్పందించలేదు.

ఇందుకు సంబంధించిన సంఘటన మొత్తం ఘటన జరిగిన ప్రదేశంలో ఉన్న హోటల్లో సీసీ కెమెరాలో రికార్డు అయింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలకు వెళితే.పూణేలోని పింప్రి చించివాడ( Pimpri Chinchiwada in Pune ) ప్రాంతంలో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఓ మహిళ పనిచేస్తుంది.ఆ మహిళను ఆఫీస్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో మహిళను ఆమె భర్త, అత్తమామలు ఆఫీస్ నుండి బయటకు రాగానే ఆ మహిళను రోడ్డుపై లాక్కొని వెళ్లి కారులో ఎక్కించారు.

ఆపై ఆ మహిళ భర్త, అత్తమామలు ఆ అమ్మాయికి మత్తుమందు ఇచ్చి అక్కడి నుంచి హుటాహుటిగా వెళ్లిపోయారు.అనంతరం ఒక గుడి వద్ద ఆ కారు ఆగిపోవడంతో ఆ మహిళ కేకలు వేయడం గమనించిన కొందరు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు.

దాంతో సమాచారం అందుకున్న పోలీసులు( polices ) వెంటనే స్పందించి ఆ మహిళను వారి నుంచి సురక్షితంగా కాపాడారు.ఇది ఇలా ఉండగా.ఆ మహిళను సొంతవారే కిడ్నాప్ చేయడానికి గల కారణం విషయానికి వస్తే., కొన్ని పత్రాలపై తన సంతకం కోసం వారు కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు తెలియజేసింది.

ఆ మహిళకు 2023లో వివాహమైనట్లు పోలీసులకు తెలిపింది.పెళ్లయిన మూడు నెలలకే భర్తతో విభేదాలు రావడంతో అప్పటినుంచి ఆమె పుట్టిఇంట్లోనే ఉంటూ జీవనం కొనసాగిస్తున్నట్లు తెలిపింది.

సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలును పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube