ఆధునిక యుద్ధ తంత్రానికే కొత్త నిర్వచనాలు చెప్పేలా ఇజ్రాయెల్ వేస్తున్న ఎత్తులు అంతు చిక్కడం లేదు.అత్యాధునిక ఆయుధ సంపత్తితో శత్రు దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది.
అంచనాలకు అందని వ్యూహాలతో శత్రువులను ఏరిపారిస్తోంది ఇజ్రాయెల్.అక్టోబర్ 7 దాడికి ప్రతీకారంగా హమాస్‌ను అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన ఇజ్రాయెల్ .ఆ సంస్థకు మద్ధతుగా నిలిచిన హెజ్‌బొల్లా, హూతీలు, ఇరాన్‌లపై ఏకకాలంతో దాడులకు దిగుతోంది.ముఖ్యంగా తన ఫోకస్ హెజ్‌బొల్లాపై పెట్టింది ఐడీఎఫ్.
కొద్దిరోజుల క్రితం లెబనాన్‌లో ఏకకాలంలో పేజర్లు పేలిపోయిన ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా.దాదాపు 3000 మంది వరకు గాయపడ్డారని లెబనాన్ తెలిపింది.అయితే మీడియాలో మాత్రం హెజ్‌బొల్లా కీలక కమాండర్లు, ఫైటర్లు, అత్యున్నత అధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతోంది.ఈ ఘటనతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది.ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహాలు చూసి నివ్వెరపోయింది.ఇది జరిగిన గంటల్లోనే వాకీటాకీలు, సెల్‌ఫోన్లు, చివరికి బాత్‌రూమ్ కమోడ్‌లు కూడా పేలిపోవడంతో హెజ్‌బొల్లా కేడర్ వణికిపోతుంది.
ఇజ్రాయెల్ సైబర్ దాడి చేస్తుందన్న భయంతో పేజర్లను వినియోగించగా.వీటిని కూడా ట్యాంపరింగ్ చేసి ఆయుధాలుగా మార్చేసింది ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్.
అయితే పేజర్ల పేలుడు ఘటనను హెజ్‌బొల్లా, ఇరాన్, నార్వే ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి.దీని వెనుక భారత సంతతికి చెందిన వ్యక్తి హస్తం ఉందని తేలడంతో అతని కోసం వేట మొదలైంది.కేరళలోని వయనాడ్‌కు చెందిన రిన్సన్ జోస్( Rinson Jose )అనే వ్యక్తికి నార్వే పౌరసత్వం ఉంది.ఇతను బల్గేరియన్ కంపెనీ నోర్టా గ్లోబల్ లిమిటెడ్‌కు యజమాని అని సమాచారం.
హెజ్‌బొల్లా దాడిలో ఇజ్రాయెల్ వాడిన పేజర్లను సప్లయ్ చేసిన కంపెనీ అతనిదేనని అంటున్నారు.రిన్సన్ పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతుండటంతో వయనాడ్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
అతని కుటుంబానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు.అయితే వారంతా అజ్ఞాతంలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రిన్సన్ కోసం నార్వే పోలీసులు ఇంటర్నేషనల్ లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.ఇతను చివరిసారిగా అమెరికా పర్యటనకు బయల్దేరి తర్వాత జాడ లేకుండా పోయాడు.
నార్వే( Norway )లోని ఓస్లో పోలీసులు రిన్సన్ కేసును దర్యాప్తు చేస్తున్నారు.