సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ప్రస్తుతం రాజకీయాల( Politics ) లో ఎంతో బిజీగా ఉండడమే కాకుండా ఈయన రాజకీయాలలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.గత పది సంవత్సరాల క్రితం పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ ఎన్నో ఇబ్బందులను, అవమానాలను ఎదుర్కొంటూ నేడు రాజకీయాలలో కూడా సక్సెస్ అందుకొని తానేంటో నిరూపించుకున్నారు.
ఇలా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా( Ap Deputy CM ) బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా సీఎంగా కొనసాగుతారని అభిమానులందరూ కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇక ప్రస్తుతం పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.అయితే ఈయనకు ముఖ్యమంత్రిగా ( Cheif Minister ) కూడా అవకాశం ఇవ్వాలని అభిమానులు పలు సందర్భాలలో డిమాండ్ చేశారు.అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ముఖ్యమంత్రి పదవి పొందడం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను ఎప్పుడూ కూడా సినిమాలలోకి రావాలని అనుకోలేదు కానీ సినిమాలలోకి వచ్చి మంచి సక్సెస్ అయ్యాను.
ఇక నేను ఎప్పుడూ కూడా రాజకీయాలలో ఉపముఖ్యమంత్రి పదవి ఆశించలేదు కానీ ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యానని తెలిపారు.అయితే ముఖ్యమంత్రిగా తాను ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదు.అలాంటి ఆశలు కూడా తనకు లేవని పవన్ కళ్యాణ్ తెలిపారు.ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu) సరైన వ్యక్తి అని ఆయన అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరమని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
సినీ నటుడిని, రాజకీయ నాయకుడిని కావాలని అనుకోలేదన్నారు.నా దేశం కోసం పనిచేయడం తనకిష్టమన్నారు.ఆదేశం కోసం ఇప్పుడు రాజకీయాలలో ఉన్నానని తెలిపారు.దేశం కోసం కష్టపడటమే తప్ప అధికార స్థానాలు నాకు ఉత్తేజాన్ని కలిగించవు అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పటికైనా తమ నాయకుడిని ముఖ్యమంత్రి స్థానంలో చూస్తామని కలలు కంటున్నవారు ఒక్కసారిగా నిరాశ చెందారని చెప్పాలి.