డ్రామాలొద్దు .. ఇమ్మిగ్రేషన్ విధానాలపై ట్రంప్‌కు షాకిచ్చేలా కమలా హారిస్ ప్రకటన

అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి.డెమొక్రాటిక్ పార్టీ నేత కమలా హారిస్‌ను( Kamala Harris ) రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుండటంతో ఆమె కూడా ఎదురుదాడికి దిగారు.

 Democratic Presidential Nominee Kamala Harris In Rare Border Visit Seeks To Blun-TeluguStop.com

ప్రధానంగా ఇమ్మిగ్రేషన్‌పై తనను విమర్శిస్తున్న ట్రంప్ శిబిరానికి షాకిచ్చేలా ప్రకటన చేశారు కమలా హారిస్.సరిహద్దుల వద్ద పటిష్టమైన భద్రతా చర్యలను విధిస్తానని , ఇమ్మిగ్రేషన్ వ్యవస్ధను పరిష్కరిస్తానని ఆమె తేల్చిచెప్పారు.

అరిజోనాలోని డగ్లస్‌ శివార్లలోని యూఎస్ – మెక్సికో సరిహద్దుల్లో( US-Mexico Border ) శుక్రవారం ఆమె పర్యటించారు.సరిహద్దు భద్రతపై కఠినమైన వైఖరిని అవలంభిస్తున్నప్పటికీ , ప్రస్తుతం అమెరికాలో ఉన్న డాక్యుమెంట్లు లేని వలసదారులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని కమలా హారిస్ స్పష్టం చేశారు.

అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే ఏళ్ల తరబడి ఇక్కడే ఉంటున్న వలసదారులకు పౌరసత్వం కల్పించడానికి మార్గదర్శకాలు రూపొందించడానికి కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు.

Telugu Americans, Donald Trump, Kamala Harris, Trump, Security, System, Mexico,

దేశ దక్షిణ సరిహద్దుల వద్ద భద్రతా పరిస్ధితిని స్వయంగా అంచనా వేయడానికి హారిస్ అరిజోనాకు( Arizona ) వచ్చారు.అక్రమ వలసలు ఇటీవలి కాలంలో అమెరికాకు తలనొప్పిగా మారాయి.అది కూడా దక్షిణ సరిహద్దు వద్ద రికార్డు స్థాయిలో వలసదారులు అడుగుపెడుతుండటంతో అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు.

అధ్యక్షురాలిగా ఈ సమస్యలను పరిష్కరించడానికి , ఇమ్మిగ్రేషన్ వ్యవస్ధను చక్కదిద్దడానికి తాను రాజకీయాలను పక్కనపెడతానని కమలా హారిస్ అన్నారు.

Telugu Americans, Donald Trump, Kamala Harris, Trump, Security, System, Mexico,

ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న నాలుగేళ్లు.ఇమ్మిగ్రేషన్ వ్యవస్ధను సరిదిద్దడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆమె మండిపడ్డారు.ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తులు, సరిహద్దుల్లో ఏజెంట్ల కొరతను పరిష్కరించలేదని కమలా హారిస్ ఎద్దేవా చేశారు.

గతంలో బోర్డర్ స్టేట్ అటార్నీ జనరల్‌గా తనకు పరిస్ధితులపై అవగాహన ఉందని ఆమె తెలిపారు.తుపాకులు, మాదకద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా చేస్తున్న అంతర్జాతీయ క్రిమినల్ సంస్థలపై విచారణ జరిపినట్లు కమలా హారిస్ గుర్తుచేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube