ఆర్మీ నియామకాల్లో పాత విధానాన్నే కొనసాగించాలి.మోడీ ప్రభుత్వ నిరుద్యోగ వ్యతిరేక విధానాలు నశించాలి.
-పి.డీ.ఎస్.యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలేబొయిన కిరణ్.
సూర్యాపేట జిల్లా:ప్రభుత్వ ఉద్యోగమంటే జీవితానికి అన్ని విధాలుగా భద్రత ఉండాలని,ఏ రంగంలోనైనా ఉద్యోగం చేస్తే రిటైర్ అయ్యేకాలం వరకు పని ఉండాలని కానీ,మోడీ ప్రభుత్వం ఇటీవల ఆర్మీ రిక్రూట్మెంట్ కు,పాత పద్ధతిని వదిలేసి,కొత్తగా అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్ ను తీసుకొచ్చిందని,ఈ పద్ధతి ప్రకారం ఉద్యోగం పొందిన అభ్యర్థులు కేవలం నాలుగు సంవత్సరాలే ఉద్యోగం చేసే అవకాశం ఉందని,నిరుద్యోగులను మోసం చేయడం కోసమే కేంద్ర ప్రభుత్వం టూర్ ఆఫ్ డ్యూటీ (టీఓడి) అనే అందమైన అబద్ధం చెప్తుందని పి.డీ.ఎస్.యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలేబొయిన కిరణ్ ఒక ప్రకటనలో విమర్శించారు.గురువారం జిల్లా కేంద్రంలో కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ రిక్రూట్మెంట్ పై మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన అగ్నిపథ్ ద్వారా దేశంలో అనేక మంది అభ్యర్థులు అభద్రతా భావానికి లోనై ఆందోళన బాట పెట్టారని చెప్పారు.ఎన్నో వ్యయ,ప్రయాసలకు గురై ఉద్యోగం పొందితే నాలుగు సంవత్సరాల తర్వాత తమ జీవితానికి భద్రత ఏదని? గత రెండు రోజులుగా భారతదేశంలో బీహార్,ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్,హర్యానా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత ఆందోళన చేస్తున్నారని తెలిపారు.అనేక మంది అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని,ఇవి కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలకు దారితీసాయని,మోడీ ప్రభుత్వం పట్ల నిరుద్యోగుల్లో ఉన్న ఆవేదన, ఆక్రోశానికి ఈ ఘటనలు నిదర్శనమని అన్నారు.కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల కిందటే పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిందని,నిరుద్యోగ యువత చాలా ఆశతో దేశ వ్యాప్తంగా ఈ నియామక ప్రక్రియ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో,పని భద్రత లేని అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీం లాంటివి వారి ఆశలపై నీళ్లు చల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మీరు ఇచ్చే ఉద్యోగాల్లో ఉద్యోగ భద్రత ఎక్కడని ప్రశ్నించారు.ఆర్మీ నియామకాల్లో పాత పద్ధతినే పాటించాలని,అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమును రద్దు చేయాలని,దేశంలో శాంతి భద్రతలను కాపాడాలని డిమాండ్ చేశారు.