వైరల్: కూతురు తింటున్న ఆహారాన్ని చూసి భయపడిన తల్లి.. అసలేం తింటుందంటే..?

ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఇక సోషల్ మీడియా ద్వారా వింత వింత ఆహార అలవాట్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

 Viral: A Mother Is Scared To See The Food Her Daughter Is Eating.. What Is She A-TeluguStop.com

ఈ వింత ఆహార అలవాట్లకు సంబంధించి చైనీలకు మించిన వారు ఎవరు ఉండరు.చైనీలు మాత్రమే పాములు, కప్పలు, పురుగులు లాంటివి ఎంతో ఇష్టంగా తింటూ ఉండడం మనం సోషల్ మీడియా( Social media ) ద్వారా చూస్తూనే ఉంటాం.

అయితే తాజాగా ఒక చైనా బాలిక ఎలుకను తింటున్నట్లు ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.ఆ బాలిక చేసిన పనికి తన తల్లి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది.

ఆపై అసలు విషయాని తెలుసుకుని సంతోషానికి గురి అయ్యింది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కు వెళ్తే.చైనా( China )కు చెందిన ఒక మహిళ తను ఇంటి నుంచి బయటకు వెళ్తూ కుడుములు చుట్టి ఉంచమని తెలియజేసింది.అయితే ఆ మహిళ తిరిగి ఇంటికి వచ్చేసరికి కూతురు ప్లేట్ లో ఎలుకను పెట్టుకొని వాటిని తినడం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది.

అసలు మ్యాటర్ ఏమిటంటే.ఆ బాలిక ఆ కుడుములను ఎలుక ఆకారంలో చేసింది అంతే.వాటిని అలాగే వేయించి తల్లి వచ్చేసరికి ఎదురుగా కూర్చొని తింటూ కనపడడంతో అవి నిజమైన ఎలుకలను అనుకొని తల్లి ఒక్కసారిగా భయపడింది.అయితే ఆ అమ్మాయి ఎలుకుగా చేసిన కుడుములు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ ఫోటోలను చూసిన.సోషల్ మీడియా నెటిజన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు.వామ్మో.ఈ ఎలుక ఆకారంలో ఉన్న వాటిని చూస్తే నిజమైన ఎలుకలు కూడా ఆశ్చర్యపోతాయేమో అంటూ కామెంట్ చేస్తుండగా.మరికొందరైతే ఒకవేళ పిల్లులు వస్తే జాగ్రత్త అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube