సినిమా ఇండస్ట్రీ లో ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు.కానీ వాళ్ళు అనుకున్న దాని ప్రకారం సినిమా ఇండస్ట్రీలో జరుగుతుందా లేదా అనే విషయాలు ఎవరికి తెలియవు.
ఇక చాలామందికి సినిమా అంటే ప్రాణం ఉంటుంది.ఆ ప్యాషన్ వల్లే చక మంది సినిమాలు తీయడానికి ఇండస్ట్రీకి వస్తారు.
ఇక ఆ తర్వాత ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు.ఇక అలాంటి వారు సైతం ఇప్పుడు ఇండస్ట్రీ లో చాలా మంది ఉన్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు చాలా సక్సెస్ లను సాధిస్తూ ముందుకు కదులుతుంది.అలాగే కొత్త కథలతో యంగ్ దర్శకులు( Young directors ) సైతం తమను తాము స్టార్ డైరక్టర్లు గా మార్చుకునే ప్రయత్నం చేస్తుంటారు.
ఇక మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్ అయిన నాగ్ అశ్విన్( Nag Ashwin ) లాంటి దర్శకుడు ప్రస్తుతం కల్కి సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాడు.
ఇక ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో కల్కి 2 సినిమాను ( Kalki 2 movie )కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.అయితే ఈ సినిమా ద్వారా ఆయన ఒక ఫిక్షన్ కథను చెప్పడమే కాకుండా మహాభారతానికి సంబంధించిన ఒక గొప్ప సారాంశాన్ని కూడా తను చెబుతుండడం విశేషం… మరి ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగ్ అశ్విన్ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.ఇక ప్రస్తుతం ఆయన కల్కి 2 సినిమా చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత ఆయన చిరంజీవితో( Chiranjeevi ) ఒక భారీ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.ఇక వీళ్ళ కాంబినేషన్ లో మహానటి తర్వాతనే ఒక సినిమా రావాల్సింది.
కానీ అనుకోని కారణాల వల్ల ఈ కాంబినేషన్ అనేది సెట్ అవ్వలేదు.ఇక దాంతో నాగ్ అశ్విన్ ప్రభాస్ తో కల్కి సినిమా చేసి భారీ సక్సెస్ ని అందుకున్నాడు.ఇక వీళ్ళ కాంబినేషన్ మీద ప్రేక్షకుల్లోనే కాకుండా ట్రేడ్ పండుతుల్లో కూడా మంచి ఆసక్తి అయితే ఉంది.మరి దానికి తగ్గట్టుగానే ఆయన కూడా చిరంజీవితో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది…
.