ఉదయాన్నే పరగడుపున( Empty Stomach ) కొన్ని రకాల పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.ఎందుకంటే శరీరాన్ని డిటాక్స్ ( Body Detox ) చేయడానికి ఇది మంచి సమయం.
అందుకే చాలా మంది ఉదయం సమయంలో ఎక్కువగా నీరు తాగుతూ ఉంటారు.ఇక మరి కొంతమంది టిఫిన్ గా కూడా పండ్లను తింటూ ఉంటారు.
అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయిని తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే బొప్పాయి రోజంతా మనకు శక్తిని అందిస్తుంది.
అలాగే ఎనర్జిటిక్ గా ఉంచుతుంది.బొప్పాయి( Papaya ) ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక బరువు ఉన్నవారు పరగడుపున ప్రతిరోజు తీసుకుంటే సులువుగా బరువు తగ్గవచ్చు.ఇక చాలాకాలంగా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు కూడా ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి పండును తింటే మంచి ఫలితం ఉంటుంది.నిజానికి ఇందులో క్యాలరీలు ( Calories ) చాలా తక్కువగా ఉంటాయి.అంతేకాకుండా పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది.బొప్పాయి పండు తినడం వలన యవ్వనంగా కనిపిస్తారు.అలాగే బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది.
బొప్పాయి పండులో విటమిన్ సి తో పాటు, ఆంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.కానీ కడుపుతో బొప్పాయి పండును తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
అలాగే ఇది చర్మానికి చాలా ఆరోగ్యకరమైనది కూడా.ఇది శరీరాన్ని డిటాక్స్ కూడా చేస్తుంది.బొప్పాయి పండు తినడం వలన అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు, మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారికి బొప్పాయి పండును తింటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.రోజు ఖాళీ కడుపుతో బొప్పాయి పండు తినాలి.
ఇలా తింటే చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిపోతుంది.అలాగే రక్తపోటు రోగులకు కూడా బొప్పాయి పండు ఉపయోగకరంగా ఉంటుంది.
రోజు ఉదయాన్నే నిద్ర లేచి బొప్పాయి నీ ఖాళీ కడుపుతో తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది.ఎందుకంటే బొప్పాయిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.
అంతేకాకుండా మలబద్ధకం సమస్య నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.