రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో దేవర మూవీ రిలీజ్( Devara movie release ) కానుండగా ఈరోజు అర్ధరాత్రి నుంచి దేవర మూవీ షోలు ప్రదర్శితం కానున్నాయనే సంగతి తెలిసిందే.అయితే దేవర సినిమాకు సంబంధించి బెనిఫిట్ షోల పేరుతో దోపిడీ జరుగుతోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
చాలా థియేటర్లలో ఒంటి గంటకు ప్రదర్శితమయ్యే షోలకు 1000 కంటే ఎక్కువ మొత్తం టికెట్ రేట్ ఉంది.
టికెట్ రేట్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ సినిమాను థియేటర్ లో చూడాలని భావించే ప్రేక్షకులు సైతం వెనుకడుగు వేస్తున్న పరిస్థితి నెలకొంది.
బెనిఫిట్ షోల పేరుతో ఇదేం దోపిడీ అంటూ కొంతమంది ఎన్టీఆర్( NTR ) అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.అభిమానాన్ని క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో టికెట్ రేట్లను మరీ భారీగా పెడితే మాత్రం కచ్చితంగా ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.
ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్( Streaming in OTT ) కానుండటం దేవరకు ఒక విధంగా ప్లస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.దేవర మేకర్స్ సైతం అనధికారికంగా జరుగుతున్న దోపిడీ విషయంలో ఒకింత జాగ్రత్తగా వ్యవహరించి విమర్శలకు తావివ్వకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు.దేవర నిజంగా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.
కథ, కథనం అద్భుతంగా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తే మాత్రం దేవర రేంజ్ మారిపోతుందని చెప్పవచ్చు.ఈ సినిమాకు హిట్ టాక్ వస్తుందా లేక మిక్స్డ్ టాక్ వస్తుందా అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.దేవర సినిమా పేరు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎంతగానో మారుమ్రోగుతోంది.
దేవర సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉండే అవకాశాలు అయితే కచ్చితంగా ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.