విడాకులకు సిద్ధమైన టీమిండియా ప్లేయర్..? భార్య ఫోటోలు తొలగించేసాడుగా..

టీమిండియా ఆటగాడు మనీష్ పాండే( Manish Pandey ) ప్రముఖ హీరోయిన్ అశ్రిత శెట్టిల( Heroine Asrita Shetty ) వివాహ జీవితంలో మనస్పర్ధలు తలెత్తినట్టుగా కనబడుతుంది.2019లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే వీరిద్దరూ అది త్వరలో విడాకులు తీసుకుపోతున్నట్లుగా వారు చేసే పనుల ద్వారా ఇట్టే అర్థమవుతుంది.దీనికి కారణం.కర్ణాటక క్రికెటర్ మనీష్ పాండే తన సోషల్ మీడియా ఖాతాలోని తన భార్య ఫోటోలను తొలగించడమే ఇప్పుడు చర్చనీయాంశముగా మారింది.అంతేకాదు హీరోయిన్ అశ్రిత శెట్టి కూడా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తన భర్తకు సంబంధించిన ఫోటోలను డిలీట్ చేసేసింది.

 Team India Player's Wife Who Is Ready For Divorce Deletes Photos, Has Manish Pan-TeluguStop.com

దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరు అతి త్వరలో విడాకులు తీసుకుపోతున్నట్లుగా వార్తలు వినపడుతున్నాయి.

Telugu Manish Pandey, Netizens, Remove, Indiaready, Ashrita Shetty-Latest News -

అశ్విత శెట్టి మంగళూరు నగరానికి చెందిన ఓ మోడల్ కం నటి.అశ్విత 2012లో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వగా.ఆ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది.తమిళంలో పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.అశ్రిత శెట్టి కేవలం తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా సుపరిచితమే.సిద్ధార్థ హీరోగా నటించిన ఎన్ హెచ్ 4 సినిమాలో( NH4 movie ) హీరోయిన్ గా నటించింది.ఇకపోతే మనీష్ పాండేను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత అశ్రిత శెట్టి సినీ ప్రపంచానికి దూరంగా ఉండిపోయింది.

కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం బాగానే యాక్టివ్ గా ఉండేది.భార్య భర్తలు దిగిన ఫోటోలు, అలాగే వారికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉండేది.

ఇక తాజాగా వీరిద్దరు దిగిన ఫోటో,లు అలాగే మనీష్ పాండేకి సంబంధించిన ప్రతి విషయాన్ని అశ్రిత శెట్టి తొలగించడంతో ఆశ్చర్యం కలుగుతోంది.

Telugu Manish Pandey, Netizens, Remove, Indiaready, Ashrita Shetty-Latest News -

మరోవైపు మనీష్ పాండే కూడా వీరిద్దరికి సంబంధించిన ఫోటోలను డిలీట్ చేశాడు.మనీష్ పాండే టీమ్ ఇండియా తరఫున 29 వన్డే మ్యాచులు ఆడగా అందులో ఒక సెంచరీతో 566 పరుగులను చేశాడు.అలాగే 39 టి20 మ్యాచ్ ( T20 match )లు ఆడాడు కూడా.

ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పూనే వారియర్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెంట్స్, సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ లాంటి జట్ల తరపున ఆడాడు.ఐపీఎల్ లో మనీష్ పాండే 171 మ్యాచ్లలో ఒక సెంచరీ, 22 అర్థ సెంచరీలతో సెంచరీలతో తన సత్తా చాటగలిగాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube