ధరలపై వామపక్ష దండయాత్ర

సూర్యాపేట జిల్లా:రోజురోజుకు పెరుగుతున్న ధరలను నియంత్రించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని,దీనికి వ్యతిరేకంగా ఈ నెల 27 నుండి 31 వరకు జిల్లా వ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాన్ని వామపక్ష శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి,సిపిఐ జిల్లా నాయకులు దోరేపల్లి శంకర్,సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గంట నాగయ్య, సిపిఐ(ఎంఎల్) ప్రజాపంథా జిల్లా కన్వీనర్ కొత్తపల్లి శివకుమార్,ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి వరికుప్పల వెంకన్న,సిపిఐ(ఎంఎల్)రామచంద్రన్ వర్గం రాష్ట్ర నాయకులు బుద్ధ సత్యనారాయణ,బహుజన కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి చామకూరి నర్సయ్య లు పిలుపునిచ్చారు.మంగళవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన వామపక్ష పార్టీల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్,డీజిల్,వంటగ్యాస్, బస్సు చార్జీలు,విద్యుత్ చార్జీలు,ఇష్టానుసారం పెంచటం మూలంగా పేద,మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

 Left-wing Invasion On Prices-TeluguStop.com

ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రజలందరికీ 14 రకాల నిత్యావసర వస్తువులను అందించాలని డిమాండ్ చేశారు.అసంఘటిత రంగ కార్మికులకు 7500 రూపాయలు ఇవ్వాలని కోరారు.

ఉపాధి హామీ చట్టానికి నిధులు పెంచి పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి యువతను ఆదుకోవాలన్నారు.

నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కల్పించాలన్నారు.ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరి రావు,మట్టిపెళ్లి సైదులు,ఏలుగురి గోవింద్,కోట గోపి, జిల్లపల్లి నరసింహారావు,మేఘనబోయిన శేఖర్,దండా వెంకటరెడ్డి,వామపక్ష నాయకులు షేక్ నజీర్,ఎర్ర అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube