వైసీపీ అధినేత వైఎస్ జగన్ ( YS Jagan )పులివెందులలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.శనివారం వైయస్ జగన్ పులివెందులలో అడుగుపెట్టగానే భారీ ఎత్తున ప్రజలు ఘన స్వాగతం పలికారు.
ఎన్నికల ఫలితాల అనంతరం మొన్నటి వరకు పార్టీ నాయకులతో గెలిచిన సభ్యులతో భేటీ అవుతూ వచ్చారు.కాగా తాజాగా శనివారం సొంత నియోజకవర్గం వైఎస్ జగన్ పులివెందులలో అడుగుపెట్టడం జరిగింది.
దీంతో స్థానిక ప్రజలు వైఎస్ జగన్ కి ఘన స్వాగతం పలకటం జరిగింది.
ఈ క్రమంలో మరోపక్క వైయస్ జగన్ నివాసంపై సొంత పార్టీ కార్యకర్తలు నాయకులు ఆందోళనకు దిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.అద్దాలు ధ్వంసం చేశారని.జగన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఈ ఘటనలో పోలీసులు సైతం పరిస్థితిని అదుపు చేయలేదని వార్తలు రావడం జరిగాయి.దీంతో పులివెందులలో జగన్ నివాసం పై దాడి జరిగినట్లు వస్తున్న వార్తలను వైసీపీ సోషల్ మీడియా విభాగం ఖండించింది.“పులివెందులలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయని కొన్ని ఎల్లోమీడియా ఛానళ్లు చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం.జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారంటూ ఆ మీడియా పిచ్చిరాతలు రాసుకుంది.కార్యకర్తలు ఆగ్రహించారంటూ తప్పుడు వార్తలు ప్రసారం చేశారు.వైయస్ జగన్ గారిని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చిన విషయాన్ని మరుగునపరచడానికి, వక్రీకరించి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారు.మానసిక రుగ్మతలతో బాధపడుతున్న కొన్ని మీడియా ఛానళ్ల అతిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు”.
స్పష్టత ఇవ్వడం జరిగింది.