మునగాల మండల కేంద్రంలో అంబులెన్స్ ఉండేలా చూడండి

సూర్యాపేట జిల్లా:మునగాల మండల ( Munagala mandal )కేంద్రంలో 108 అంబులెన్స్ లేక మండల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల సరిహద్దుల్లో 65వ,జాతీయ రహదారిపై ఉన్న ఈ మండలంలో ఆకుపాముల,ముకుందాపురం, తాడ్వాయి స్టేజీ,మొద్దులచెర్వు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి.

 See That There Is An Ambulance At Munagala Mandal Centre , , Munagala Mandal ,-TeluguStop.com

నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో మండల కేంద్రంలో 108 అంబులెన్స్ సర్వీస్( 108 Ambulance Service ) అందుబాటులో లేక,కోదాడ, సూర్యాపేట నుండి వచ్చే వరకు ప్రమాదబారిన పడిన వారి ప్రాణాలు రక్షించడంలో జాప్యం జరుగుతుందని మండల ప్రజలు వాపోతున్నారు.

గతంలో మండల కేంద్రంలో ఉన్న 108 అంబులెన్స్ సదుపాయాన్ని ఇటీవల తీసేయడంతో రోడ్డు ప్రమాదాలతో పాటు,వివిధ గ్రామాల్లో ఆరోగ్య కారణాలతో ఇబ్బంది పడేవారికి,గర్భిణీ స్త్రీలకు ఇబ్బందిగా మారిందనిఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆపద సమయంలో 108 కు ఫోన్ చేస్తే అంబులెన్స్ సూర్యాపేట నుంచి వస్తుందని చెప్తున్నారని,ఈ లోగా కొంతమంది పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోతుండగా,మరి కొంతమంది క్షతగాత్రులు సరైన సమయంలో వైద్యం అందక నరకయాతన అనుభవిస్తున్నారని బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి మునగాల మండల కేంద్రానికి 108 అంబులెన్స్ సర్వీస్ వెంటనే కేటాయించి,ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.

అలాగే మునగాల మండలంలో జాతీయ రహదారిపై డేంజర్ స్పాట్స్ గా ఉన్నఆకుపాముల,ముకుందాపురం,మొద్దులచెర్వు క్రాసింగ్ వద్ద అండర్ పాస్సింగ్ నిర్మాణం చేసి ప్రమాదాలను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube