ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) కుప్పం పర్యటన ఖరారు అయింది.ఈనెల 25 నుంచి రెండు రోజులపాటు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించబోతున్నారు.25న మధ్యాహ్నం 12:30 గంటలకు హెలికాప్టర్ లో కుప్పం పిఈఎస్ మెడికల్ కళాశాల వద్దకు చేరుకుంటారు.అనంతరం మధ్యాహ్నం 1 గంటకు అన్నా క్యాంటీన్ ను ప్రారంభిస్తారు.1 గంట వరకు ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.మధ్యాహ్నం 3:30 గంటలకు పిఇఎస్ మెడికల్ కళాశాలలోని ఆడిటోరియంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.ఆ తర్వాత సాయంత్రం 5:30 గంటల నుండి 6:00 వరకు రిజర్వ్ గా ఉంటారు.
ఆరు గంటలకు ఆర్ అండ్ బి అత్యధిక గృహంలో కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తారు.రాత్రి 8:00 గంటలకు ఆర్ అండ్ బి అతిథి గృహం చేరుకునే రాత్రికి అక్కడే బస చేస్తారు.రెండో రోజు ఉదయం 10 గంటలకు జిల్లా నాయకులతో భేటీ అవుతారు.11 గంటలకు ప్రజల నుండి విన్నతులను స్వీకరిస్తారు.12 గంటలకు శాంతిపురంలో కాలువ పరిశీలించడం జరుగుద్ది.ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు రిజర్వ్ గా ఉంటారు.మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పిఈఎస్ కళాశాలలోని ఆడిటోరియంలో నియోజకవర్గ నాయకులతో సమావేశం అవుతారు.
ఆ తర్వాత సాయంత్రం 4:30 గంటలకు కుప్పం పర్యటన ముగించుకుని హెలికాప్టర్ లో పిఇఎస్ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.ఎన్నికలలో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాక సొంత నియోజకవర్గానికి అధినేత వస్తుండటంతో స్థానిక పార్టీ నేతలు ఘన స్వాగతం పలకడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.