పాఠశాలల వద్ద పరేషాన్ చేస్తున్న కేటుగాళ్లు...!

సూర్యాపేట జిల్లా:మునగాల మండల( Munagala mandal ) కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్,ఆదర్శ పాఠశాల వద్ద ఉదయం,సాయంత్రం కొందరు కేటుగాళ్లు బైక్ లపై కేకలు వేస్తూ అమ్మాయిలను వేధిస్తున్నారని విద్యార్ధినులు వాపోతున్నారు.వీరి ఆగడాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయని,స్కూలుకు వెళ్లే విద్యార్ధినులను ఇబ్బంది పెడుతూ బైక్ లపై ( Bikes )రౌండ్స్ వేస్తూ కేరింతలు కొడుతూ హల్చల్ చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని,స్కూల్ కి రావాలంటేనే భయమేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

 Scammers Causing Havoc At Schools...! , Munagala Mandal, Suryapet District , Sch-TeluguStop.com


స్కూల్( schools ) కి వెళ్ళాలంటే పిల్లలు ఇబ్బంది పడుతున్నారని,కొందరు యువకులు మద్యం,గంజాయి సేవించి అమ్మాయిలను వేధిస్తున్నారని,ఈ ఆకతాయిల ఆటలు కట్టడి చేయడానికి పోలీసులు( Police ) ఉదయం, సాయంత్రం పెట్రోలింగ్ చేసి, వీరిని పాఠశాలల ఆవరణలకు రానివ్వకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.ఈ బ్యాచ్ మండల కేంద్రంలో కూడా వీధులు ఇష్టానుసారంగా తిరుగుతూ గ్రామస్తులను కూడా భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube