రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర పునర్విభజన చట్టం 2014లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఇచ్చిన హామీల అమలులో నేటి కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు గట్ల రమాశంకర్ విమర్శించారు.ఈనెల 21న హైదరాబాదులో నిర్వహించే రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ స్థానిక జిల్లా కార్యాలయంలో పోస్టల్ ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి సంస్థలను ఆస్తులను విభజించడానికి,ఉద్యోగుల పంపిణీకి,నదీజలాల న్యాయమైన వాటా, హార్టికల్చర్ యునివర్సిటీ, బయ్యారం ఉక్కు కర్మాగారం,ఖాజీపేటలో రైల్వే కోచ్ తదితర హామీలను తెలంగాణకు ఇచ్చిందని,2014 లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం పై హామీలను అమలు చేయుటకు పూనుకోకపోగా,ప్రతి సందర్భంలో తెలంగాణ ఏర్పాటుపై విద్వేషాన్ని వెళ్లకక్కుతుందని,మన విద్వేషపు విశ్వగురువు ప్రధాని నరెంద్రమోడీ పెండింగ్ ప్రాజెక్ట్ లకు అనుమతులు ఇవ్వకపోగా నదీ జలాలపై తెచ్చిన గెజిట్ తో తెలంగాణ ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

 The Central Government Has Failed To Fulfill Its State Bifurcation Promises, Rai-TeluguStop.com

ఇప్పటి వరకు కృష్ణాజలాల్లో మన వాటా తేల్చకుండా జాప్యం చేస్తున్నారన్నారు.ఒకవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్షతతో వ్యవహరిస్తుంటే గత పదేండ్లుగా రాష్త్రంలో అధికారంలో వున్న బీఆర్ఎస్ ఏనాడూ నిలదీసింది లేదని,విభజన హామీల అమలుకోసం పోరాడింది లేదని,కేసిఆర్ అతని కుటుంబం కాళేశ్వరం నుండి నేరెళ్ళ ఇసుక దందా మీదుగా డిల్లి లిక్కర్ మాఫియా వరకు చేసిన అక్రమాల నుండి రక్షణ పొందుటకు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ జన సమితి విభజన హామీలను అమలు అమలు చేయాలని కోరుతూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇతర మంత్రులకు వినతి పత్రాలు సమర్పించిందన్నారు.2023 జనవరి 30వ తేదీన ఢిల్లీలో దీక్షలు చేపట్టిందని, అయినా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని అన్నారు.ఈ నేపథ్యంలో విభజన హామీల సాధన ఉద్యమం తీవ్రం చేయుట లో భాగంగా 21 జనవరి 2024న నిర్వహించే సదస్సును విజయ వంతం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో రైతు జన సమితి జిల్లా ఉపాధ్యక్షులు పనుకోటి సూర్యనారాయణ,జన సమితి జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్,విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు బొమ్మగాని వినయ్ గౌడ్, జన సమితి జిల్లా నాయకులు గడ్డ యాకూబ్ రెడ్డి,నరేష్,సురేందర్ తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube