లింగ నిర్దారణ,బ్రూణ హత్యలకు ఐఎంఏ వ్యతిరేకం...!

చట్ట వ్యతిరేకమైన లింగ నిర్ధారణ,బ్రూణ హత్యలను ఐఎంఏ సమర్థించదని ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.జిల్లా కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత కొంతకాలంగా సూర్యాపేటలో వైద్యశాలలు అబార్షన్లకు అడ్డాగా మారుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి వాటిని ఐఎంఐ వ్యతిరేకిస్తుందన్నారు.

 Ima Is Against Gender Determination, Bruna Murders , Bruna Murders , Ima, Gender-TeluguStop.com

సమాజంలో ఒక మనిషి ఆరోగ్యం పట్ల నిబద్దతతో పనిచేసే వ్యవస్థలలో వైద్య వ్యవస్థ సామాజిక బాధ్యతలు కూడా ముందుంటుందని అన్నారు.ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు వైద్య వ్యవస్థతోపాటు సమాజం కూడా తమ వంతు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

ప్రభుత్వ ఆదేశానుసారం ఎంటిపి యాక్ట్ ప్రకారం ఆయా గర్భిణీ స్త్రీల ఆరోగ్యపరమైన సమస్యలను దృష్టిలో పెట్టుకొని తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే స్త్రీల వైద్యాని పుణులు గర్భవిచ్చితి చేయడం జరుగుతుందని తెలిపారు.ఎంతో ఉన్నతమైన విద్యను అభ్యసించి అర్హత విలువలు కలిగిన ఏ ఒక్క వైద్యుడు చట్ట వ్యతిరేకంగా అబార్షన్లు చేయరని తెలిపారు.

కొందరు అర్హత లేకుండా వైద్యులుగా చలామణి అవుతూ డబ్బు కోసం ప్రలోభపడి ఇలాంటి పనులు చేస్తున్నారని, ఇలాంటివారిని ఐఎంఐ సమర్థించదన్నారు.సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజలలో అవగాహన కల్పిస్తే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని తెలిపారు.

చట్టంలోని లొసుగులను, ఈ సమాజంలోని కొందరి బలహీనతలను అడ్డం పెట్టుకొని అన్ని వ్యవస్థలలో కొందరు దురాశపరులు ధనార్జనకు అణువుగా వాడుకునే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఐఎంఐ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube