సూర్యాపేట జిల్లా:జిల్లాలో సిఎంఆర్ రైస్ అందించని రైస్ మిల్లులపై ముమ్మర తనిఖీలు నిర్వహించి పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందించామని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 16 న పెండింగ్ సిఎంఆర్ రైస్ మిల్లులపై నియమించిన విజిలెన్స్ అండ్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ముమ్మర తనిఖీలు చేసి పెద్ద మొత్తంలో తేడాలను గమనించి,పూర్తి నివేదిక అందించారని తెలిపారు.తిరుమలగిరి,కోదాడలోని మిల్లులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్లక్ష్యంగా వ్యవహరించిన మిల్లు యాజమాన్యాలపై ప్రభుత్వ నిర్ణయం ప్రకారం చర్యలు ఉంటాయన్నారు.
సూర్యాపేట జిల్లాలోని ప్రతి మిల్లు యొక్క నివేదికలను ప్రభుత్వానికి పంపించడం జరిగిందని,ఇంకా కొన్ని మిల్లుల్లో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని,పెండింగ్ సిఎంఆర్ అందించకపోతే కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.