సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణంలో వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని టీఆర్ఎస్ నాయకులు,కోదాడ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సంపెట ఉపేందర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు.మంగళవారం కోదాడ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ,ప్రజా సమస్యలపై ఆహార్నిషలు కష్టపడుతున్న బిసి ఎమ్మెల్యేపై షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకొని,తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్ కుటుంబమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేక కుటుంబమని,ఆ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని,తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఆంధ్రాకు పారిపోయి,ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకొని కాయలు కోసుకోవటానికి వచ్చిన షర్మిలకు తెలంగాణ రాష్ట్రంలో తిరిగే అర్హత లేదని మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ ద్రోహి షర్మిలకు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.