సూర్యాపేట జిల్లా: బహుజనులకు రాజ్యాధికారం సాధించాలన్న ఏకైక లక్ష్యంతో బహుజన సమాజ్ వాది పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జనగామ జిల్లాలో చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రారంభమైంది.వెలుగుపల్లి గ్రామం నుండి తుంగతుర్తి మీదుగా అన్నారం గ్రామంలో యాత్రను కొనసాగిస్తూ ఆయన మాట్లాడుతూ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం మీదుగా యాత్రను ప్రారంభించి నేటికి 14వ రోజుకు చేరుకుందన్నారు.
ఈ 14 రోజులలో ఎక్కడ చూసినా డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యలతో పాటు, వృద్ధాప్య పింఛన్ల,నిరుద్యోగ భృతి లాంటి సమస్యలు వెలుగు చేస్తున్నాయని తెలిపారు.ఉద్యోగాల్లేక యువత మద్యానికి అలవాటు పడి జీవితాలను కోల్పోతున్నారని వాపోయారు.
గ్రామాల్లో,తండాల్లో విపరీతమైన బెల్ట్ షాప్ ఉండడంతో యువకుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైందని అన్నారు.ప్రజలు వివిధ రకాల సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు.
అదేవిధంగా బహుజన సమాజ్ వాదీ పార్టీ యాత్ర మూడు వందల రోజులు కొనసాగుతుందని,ఐదు వేల గ్రామాలను సందర్శించనున్నామని తెలిపారు.