సూర్యాపేట జిల్లా: తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘం జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఆయా మండల కేంద్రాల్లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట గురువారం గ్రామ పంచాయతీ సిబ్బంది( Gram Panchayat staff ) నిరసన సమ్మె నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు జేఏసి నేతలు మాట్లడుతూగ్రామపంచాయతీలో పని చేస్తున్న సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేయాలని, అర్హతలను బట్టి కారోబార్,బిల్ కలెక్టర్( Carobar, Bill Collector ) సహాయ కార్యదర్శిగా నియమించాలని, ఆదివారం,పండగ రోజు సెలవు దినంగా ప్రకటించాలని,గ్రామ పంచాయతీ సిబ్బందికి జీవో నెంబర్ 60 ప్రకారం రూ.15,600 పంచి, ఆపరేటర్,ఎలక్ట్రిషన్, డ్రైవర్లు,కారోబార్,బిల్ కలెక్టర్లకు రూ.19,500 నిర్ణయించాలని డిమాండ్ చేశారు.అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని కోరారు.ప్రభుత్వాలు స్పందించకపోతే సరైన సమయంలో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.




Latest Suryapet News