ఈ డాక్టర్ మనిషి రూపంలో ఉన్న దేవుడే.. 5 రూపాయలకే పేదలకు వైద్యం అందిస్తూ?

ప్రస్తుత కాలంలో 5 రూపాయలకు చాక్లెట్, బిస్కెట్ ప్యాకెట్ మినహా ఏమీ కొనుగోలు చేయలేము.లక్షల్లో వేతనాలు ఉంటే తప్ప అబ్బాయిలకు పెళ్లి కాని పరిస్థితి నెలకొంది.

 Doctor Shankar Gouda Greatness Details Here Goes Viral In Social Media , Doctor-TeluguStop.com

తాజాగా ఒక అమ్మాయి నెలకు 10 లక్షల రూపాయల వేతనం వచ్చే వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని చెప్పగా ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది.అయితే ఒక డాక్టర్ మాత్రం తన దగ్గరకు వచ్చే రోగుల నుంచి డబ్బులు ఆశించకుండా తక్కువ మొత్తానికే వైద్యం చేస్తున్నారు.

వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా కర్ణాటకకు చెందిన డాక్టర్ శంకర్ గౌడ ( Dr.Shankar Gowda )గురించి తెలిస్తే మాత్రం హ్యాట్సాఫ్ అనాల్సిందే.చర్మ వ్యాధి నిపుణులుగా పేరు సంపాదించుకున్న శంకర్ గౌడ తన దగ్గరకు ఎలాంటి చర్మ సమస్య వచ్చినా ఆ సమస్యకు సులువుగా చెక్ పెడతారు.తక్కువ ధరకే దొరికే మందులను ప్రిస్క్రిప్షన్ లో ఇచ్చేవారు.

మణిపాల్( Manipal ) లోని కస్తూర్బా మెడికల్ లెడ్జ్( Kasturba Medical Ledge ) నుంచి శంకర్ గౌడ ఎంబీబీఎస్ డిగ్రీ పొందారు.

గ్రామాలలోని ప్రజలకు సరైన వైద్య చికిత్స అందడం లేదని భావించిన ఆయన ఆరోగ్య సమస్యలతో బాధ పడేవాళ్ల సమస్యలను తీర్చుకోవడం డైరెక్ట్ గా వెళ్లి ప్రజలను కలిసేవారు.ఇప్పటివరకు ఈ డాక్టర్ కు సొంత కారు కూడా లేదంటే ఎంత నిస్వార్థంగా పని చేశారో అర్థమవుతుంది.బస్సులో ప్రయాణం చేసే ఈ డాక్టర్ వైద్యుల కోసం ఎక్కువ సమయం కేటాయించడంతో పాటు ఏ మాత్రం చిరాకు పడకుండా పరిష్కారం చూపిస్తారు.

శంకర్ గౌడ గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఆయన దగ్గర వైద్యం చేయించుకున్న వాళ్లు చెబుతారు.డాక్టర్ శంకర్ గౌడకు ప్రభుత్వం నుంచి సహకారం అందితే ఆయన మరింత ఎక్కువమందికి వైద్య సహాయం అందించే అవకాశాలు అయితే ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube