మూడు వేలకు పైగా తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న ఆయన లబ్ధిదారులకు పోడు పట్టాలను పంపిణీ చేశారు.
అనంరతం కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో న్యాయం చేస్తున్నామని చెప్పారు.జల్, జంగిల్, జమీన్ ను సాకారం చేస్తున్నామని తెలిపారు.
పోడు భూములకు రైతు బంధు ఇస్తున్నామన్నారు.అంతేకాకుండా ఇప్పటివరకు రూ.73 వేల కోట్లు రైతు ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు.







