దక్షిణాఫ్రికా కమ్యూనిటీలలో జరిగే పెళ్లిళ్ల కహాని తెలిస్తే ఫిదా అవుతారు.. నిజం!

భారతీయ సంస్కృతీసంప్రదాలలో వివాహానికి( Marriage ) పెద్దపీట వేయడం జరిగింది.అందుకే ఇక్కడ పెళ్లిళ్లు ఎన్నో కట్టుబాట్ల మధ్య చాలా అంగరంగ వైభవంగా సంప్రదాయంగా జరుగుతూ ఉంటాయి.

 Fascinating Wedding Traditions Among South African Communities Details, Viral La-TeluguStop.com

అయితే ఇలా ఒక్క ఇండియాలోనే కాదు సుమా.ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఒక్కో దేశంలో ఒక్కో సంప్రదాయంలో వివాహాలు చూడ ముచ్చటగా జరుగుతుంటాయి.

ముఖ్యంగా సౌతాఫ్రికాలోని( South Africa ) వెడ్డింగ్ ట్రెడిషన్స్ చాలా ఆకట్టుకుంటాయని చెబుతున్నారు.ఎందుకంటే దక్షిణాఫ్రికాలో వివాహాలు విభిన్న సంస్కృతులను మిళితం చేస్తాయి.

ప్రధానంగా 5 విభిన్న సంప్రదాయాలు దక్షిణాఫ్రికా వివాహాలను ప్రత్యేకంగా నిలుపుతాయి.

Telugu Thresold, Dance Love, Lobola, Traditional, African, Story Marriages, Umab

అవును, దక్షిణాఫ్రికా వివాహాలలో “లోబోలా” ( Lobola ) అనే ఒక ముఖ్యమైన సంప్రదాయం వుంది.ఈ సంప్రదాయం ప్రకారం గౌరవం, ఐక్యతకు చిహ్నంగా వరుడి కుటుంబం వధువు కుటుంబానికి బహుమతుల రూపంలో డబ్బు లేదంటే ఇతర వస్తువులు ఇవ్వాల్సి ఉంటుంది.వరుడు వధువును చూసుకోగలడని నిరూపించడానికి కట్నం లాంటి ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారని వినికిడి.

ఇక కొన్ని దక్షిణాఫ్రికా కమ్యూనిటీలలో, వివాహాల సమయంలో “కోలా గింజను పగలగొట్టడం” ఒక సంప్రదాయంగా వస్తోంది.అంతే పెళ్లి సమయంలో వధువు, వరుడు కలిసి ఈ గింజను పగలగొడతారు.

అలా పగిలిన గింజలోని ముక్కలను ఇద్దరూ తీసుకుంటారు.ఐక్యత, గౌరవం, ఆతిథ్యాన్ని సూచిస్తూ వైవాహిక జీవితమంతటా ఆనందంగా గడపాలని ఈ సంప్రదాయం ఉద్దేశం.

Telugu Thresold, Dance Love, Lobola, Traditional, African, Story Marriages, Umab

“ఉమాబో”( Umabo ) అనేది వధువు స్త్రీగా మారడాన్ని జరుపుకునే ఒక ప్రత్యేక జులు సంప్రదాయాన్ని సూచిస్తుంది.ఇందులో భాగంగా వధువు కుటుంబం ఆమె వెళ్లే అత్తగారింటికి కుండలు, బ్లాంకెట్స్ వంటి ముఖ్యమైన వస్తువులను బహుమతిగా తీసుకు వెళ్తుంది.అంటే ఇక్కడ సారెలాగ అన్నమాట.అదేవిధంగా దక్షిణాఫ్రికా వెడ్డింగ్ రిసెప్షన్‌లలో ఎనర్జిటిక్ డ్యాన్సులు హైలైట్‌గా నిలుస్తుంటాయి.వీటిలో “డ్యాన్స్ ఆఫ్ లవ్”( Dance Of Love ) సంప్రదాయం ఒకటి.ఈ ట్రెడిషన్‌లో భాగంగా వధూవరులు తమ ప్రేమను, నిబద్ధతను డ్యాన్స్ ద్వారా ఎక్స్‌ప్రెస్ చేస్తారు.

అదేవిధంగా ఇక్కడి వివాహాల్లో “క్రాసింగ్ ఆఫ్ ది థ్రెషోల్డ్” అనే ఒక సంప్రదాయం విశేషంగా కనబడుతుంది.వధూవరులు వారి కొత్త ఇంటికి మొదటిసారి ప్రవేశించినప్పుడు ఇది జరుగుతుంది.

ఈ సంప్రదాయం అదృష్టాన్ని తెస్తుందని, దుష్టశక్తులను దూరంగా ఉంచుతుందని సౌతాఫ్రికా ప్రజలు నమ్ముతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube