బొప్పాయి.ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.
పల్లె ప్రాంతాల్లో విరివిగా లభ్యమయ్యే బొప్పాయి పండ్లు రుచిగా ఉండటమే కాదు బోలెడన్ని పోషక విలువలు సైతం కలిగి ఉంటాయి.అందుకే బొప్పాయి ఆరోగ్యపరంగా అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది.
అయితే చర్మ సౌందర్యానికి కూడా బొప్పాయి ఎంతగానో ఉపయోగపడుతుంది.ముఖ్యంగా బొప్పాయితో ఇప్పుడు చెప్పబోయే విధంగా ఫేస్ క్రీమ్‌ను తయారు చేసుకుని రోజు వాడితే కనుక వివిధ రకాల చర్మ సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు.
మరి ఇంతకీ బొప్పాయి తో ఫేస్ క్రీమ్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందు దోరగా పండిన బొప్పాయి ని తీసుకుని పై తొక్క, లోపల ఉండే గింజలు తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో ఒక కప్పు స్వీట్ ఆల్మండ్ ఆయిల్ మరియు గ్రైండ్ చేసి పెట్టుకున్న బొప్పాయి మిశ్రమాన్ని వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత ఉడికించిన మిశ్రమాన్ని చల్లార పెట్టుకుని.పల్చటి వస్త్రం సాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత మరో గిన్నెను తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి ఆయిల్, రెండు చుక్కలు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని ఐదారు నిమిషాల పాటు మిక్స్ చేస్తే బొప్పాయి ఫేస్ క్రీమ్ సిద్ధం అయినట్టే.
ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవాలి.
రోజు నైట్ నిద్రించే ముందు ఈ క్రీమ్‌ను ముఖానికి అప్లై చేసుకోవాలి.తద్వారా చర్మం తెల్లగా మరియు కాంతివంతంగా మారుతుంది.చర్మంపై ఉండే మచ్చలు క్రమంగా మాయం అవుతాయి.డ్రై స్కిన్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
మరియు ముడతలు, సన్నని చారలు వంటి వృద్ధాప్య లక్షణాలు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.