CLP Meeting: సాయంత్రం ప్రజాభవన్ లో సీఎల్పీ సమావేశం..!

హైదరాబాద్ లోని ప్రజాభవన్ (Prajabhavan) లో ఇవాళ సాయంత్రం సీఎల్పీ సమావేశం (CLP Meeting) కానుంది.ఈ మేరకు సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన ఈ భేటీని నిర్వహించనున్నారు.

 Clp Meeting At Praja Bhavan In The Evening-TeluguStop.com

కాగా రేపు అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ ( Irrigation Department) పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది.శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం ఇరిగేషన్ శాఖపై అసెంబ్లీ(Assembly)లో చర్చ జరగనుంది.

దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు.ప్రాజెక్టులను కేఆర్ఎంబీ (KRMB)కి అప్పగించే విషయంలో చెలరేగిన వివాదంపై నేతలు ప్రధానంగా చర్చించనున్నారు.

అలాగే ఎల్లుండి మేడిగడ్డను ఎమ్మెల్యేలు(MLA’s) సందర్శించనున్నారు.కాగా ఎమ్మెల్యేల మేడిగడ్డ సందర్శనపై కూడా ఇవాళ్టి సీఎల్పీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube