సాధారణంగా కొందరిలో ఆకలి మందగిస్తూ ఉంటుంది.అంటే ఆకలి లేకపోవడం.దాంతో ఏ ఆహారాలు సరిగ్గా తీసుకోలేరు.ఫలితంగా పోషకాల కొరత ఏర్పడి.అనేక అనారోగ్య సమస్యల బారిన పడతారు.ముఖ్యంగా బరువు కోల్పోవడం, తీవ్ర అలసట, నీరసం, రక్త హీనత, పొత్తి కడుపు నొప్పి, గ్యాస్టిక్ ప్రోబ్లమ్స్ వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది.
అందుకే ఆకలి లేమిని అస్సలు నిర్లక్ష్యం చేయరాదు.అయితే చాలా మంది ఆకలిని పెంచుకునేందుకు ట్యాబ్లెట్స్ వాడతారు.
కానీ, ఇప్పుడు చెప్పబోయే టిప్స్ పాటిస్తే.సులువుగా ఆకలి లేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు.యాలకులు ఆకలిని పెంచడంలో అద్భుతంగా సహాయపడతాయి.భోజనం చేసే పావు గంట ముందు రెండు లేదా మూడు యాలకులను బాగా నమిలి మింగేయాలి.
ఇలా చేస్తే ఆకలి పెరుగుతుంది.
అలాగే ఆకలి పెంచే ఆహారాల్లో ఖర్జూరం కూడా ఒకటి.ప్రతి రోజు నాలుగు లేదా ఐదు ఖర్జూరాలను డైట్‌లో చేర్చుకోవాలి.ఇలా చేస్తే ఆకలి పెరగడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
కొత్తిమీరకు కూడా ఆకలిని పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.కొన్ని కొత్తిమీర ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి.ఆ తర్వాత వడబోసి.ఆ నీటిలో తేనె కలిపి తీసుకోవాలి.
ఇలా రెగ్యులర్‌గా చేస్తే.ఆకలి పెరుగుతుతంది.
మరియు జీర్ణ వ్యవస్థ పని తీరు కూడా పెరుగు పడుతుంది.
ఆకలి లేమిని దూరం చేయడంలో మెంతులు కూడా ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి.
మెంతులను డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకోవాలి.ఆ పొడిలో కొద్దిగా తేనె కలిపి.
తీసుకోవాలి.ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని తీసుకుంటే.
జీర్ణ వ్యవస్థ శుభ్రం అవుతుంది.మరియు ఆకలి పెరుగుతుంది.
ఇక ఈ చిట్కాలతో పాటు ఆహారాన్ని ఎప్పుడూ తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోండి.అలాగే సరైన సమయానికి తీసుకోండి.