కార్తీకదీపం ఫ్యాన్స్ కు ఝలక్.. వంటలక్క పాత్ర ముగిసినట్లే..?

బుల్లితెర సీరియళ్లలో ఒకటైన కార్తీకదీపం గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి స్టార్ మా ఛానెల్ లో రాత్రి 7.30 గంటలకు ప్రసారమవుతోంది.మొదట్లో పెద్దగా ప్రేక్షకాదరణ పొందని ఈ సీరియల్ మౌత్ టాక్ వల్ల ప్రేక్షకాదరణ పొందడంతో పాటు ఇతర సీరియళ్లకు గట్టి పోటీని ఇస్తోంది.ఇతర పాత్రలతో పోలిస్తే ఈ సీరియల్ లో వంటలక్క పాత్ర అంటే ఎంతోమంది అభిమానిస్తారు.

 Shocking Rumours About Kartheeka Deepam Serial,latets Tollywood Telivision News-TeluguStop.com

అయితే ఈ పాత్ర త్వరలోనే చనిపోతుందని తెలుస్తోంది.

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా రొటీన్ గా సాగుతున్న ఈ సీరియల్ ను వంటలక్క చనిపోవడం ద్వారా మలుపు తిప్పాలని డైరెక్టర్ భావిస్తున్నారని తెలుస్తోంది.

అతి త్వరలో వెయ్యి మార్కును అందుకోనున్న ఈ సీరియల్ ను ఇతర సీరియల్స్ కు భిన్నంగా ముగించాలని ఈ సీరియల్ దర్శకుడు భావిస్తున్నారని తెలుస్తోంది.రీమేక్ సీరియల్ అయినప్పటికీ ఈ సీరియల్ స్ట్రెయిట్ సీరియల్స్ కు గట్టి పోటీని ఇస్తుండటం గమనార్హం.

Telugu Shock, Rumours, Vantalakka Role-Movie

ఈ సీరియల్ కు శుభం కార్డ్ పడటానికి చాలా సమయం ఉన్నా వంటలక్క చనిపోయిన తర్వాత డాక్టర్ బాబు నిజాలు తెలుస్తాయని, మోనిత ఆడిన నాటకాలు కూడా తెలిసి ఆమెను డాక్టర్ బాబు అసహ్యించుకుంటారని సమాచారం.మరి నిజంగా వంటలక్క పాత్ర చనిపోతుందా.? లేదా.? తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే.అయితే నెటిజన్లు మాత్రం వంటలక్క చనిపోతే కార్తీకదీపంను చూడలేమంటూ కామెంట్లు పెడుతున్నారు.

మలయాళం, తెలుగులో హిట్టైన ఈ సీరియల్ ను ఇతర భాషల టీవీ ఛానెళ్ల నిర్మాతలు కూడా తమ భాషల్లో నిర్మించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే వంటలక్క పాత్రకు ప్రేమీ విశ్వనాథ్ న్యాయం చేసినట్టుగా ఇతర నటీమణులు న్యాయం చేయలేరని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కార్తీకదీపం సీరియల్ తరువాత స్టార్ మా ఛానెల్ లో ప్రసారమయ్యే కొత్త సీరియల్ లో ప్రేమీ విశ్వనాథ్ నటిస్తారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube