సూర్యాపేట జిల్లా:సర్వమత సమానత్వాన్ని బోధించి,ఆచరించి చూపిన శ్రీ రామకృష్ణ పరమహంస జీవితం నేటి మానవులందరికీ ఆచరణీయమని సంస్కృత భారతి కార్యకర్త చింతకింది సద్గుణ అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై గల శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆశ్రమంలో శ్రీ రామకృష్ణ పరమహంస187వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె “భగవద్గీత శ్రీ రామకృష్ణ పరమహంస జీవితం” అనే అంశంపై ఉపన్యసించారు.వందలాది మంది భక్తులు పాల్గొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూజల్లో పాల్గొన్నారు.
భజనలు,పారాయణాలు సద్గ్రంధ పఠనం చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి జిల్లా కార్యదర్శి దొంగరి సోమయ్య,పెండెం చంద్రశేఖర్, స్వర్ణలత,కోనేటి వెంకన్న,శశికళ,నాగవల్లి ప్రభాకర్,మొరిశెట్టి రామ్మూర్తి,రాగి శ్రీనివాసాచారి, కొంపెల్లి శ్రీనివాసు,గుండాల లక్ష్మయ్య నాగవల్లి దశరథ,నామిరెడ్డి పాపిరెడ్డి,నామిరెడ్డి సత్తిరెడ్డి, భాస్కరాచారి,చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.