సూర్యాపేట జిల్లా:కోదాడ మండలం గుడిబండ గ్రామం అడ్లూరు పునరావాస కేంద్రంలోని ప్లాట్ల గోల్ మాల్ లో కీలక సూత్రధారి హుజూర్ నగర్ ఆర్డీవో ఆఫీస్ ఉద్యోగి నాగరాజుగా గుర్తించి అతినిపై ఫిర్యాదు చేశారు.సుమారు 6 ప్లాట్ల 1452 చదరపు గజాల క్రీస్తు కృప మందిరము చర్చి ఖాళీ స్థలాన్ని గాదె వీరారెడ్డి తండ్రి వెంకటరెడ్డి మరియు గుండ్లపల్లి గ్రామానికి చెందిన బండి పుల్లారెడ్డి వారి తరపున మరో ముగ్గురు రైతులకు అందె వీరారెడ్డి తండ్రి వెంకటేశ్వర్ రెడ్డి పట్టాలు సృష్టించి వారి దగ్గర తొమ్మిది లక్షల రూపాయలు తీసుకుని నకిలీ ధ్రువపత్రాలు సృష్టించడానికి హుజూర్ నగర్ ఆర్డీఓ కార్యాలయంలోని సెక్షన్ అధికారి నాగరాజు పూర్తి సహకారం అందిస్తున్నారనే విషయం వెలుగు చూడడంతో అందరూ షాక్ గురయ్యారు.
ప్రతి పునరావాస గ్రామాలలో ఒక వ్యక్తిని నియమించి ఆవ్యక్తి ద్వారా ఖాళీ ప్లాట్లలను విక్రయిస్తూ నాగరాజు కనుసన్నల్లో లక్షల రూపాయల కుంభకోణం జరుగుతుందని,పూర్తి చర్చి స్థలాన్ని ఆరు ప్లాట్లుగా విభజించి అమ్ముకున్న నాగరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని అడ్లూరు ఆర్ అండ్ ఆర్ నిర్వాసితులు కొమ్ము ఇస్మాయిల్,కొమ్ము అచ్ఛాలు,ప్రకాష్ రావు తదితరులు సోమవారం నాడు హుజూర్ నగర్ ఆర్డీవోకు పిర్యాదు చేశారు.ఇదిలా వుండగా 2010లో దగ్గుపాటి సువార్తకు ఆర్ అండ్ ఆర్ సెంటర్లో 11వ నెంబర్ ప్లాట్ కేటాయించగా దానిని 2019లో పింగళి సైదిరెడ్డి తండ్రి వెంకటరెడ్డికి అమ్మడం జరిగిందని,ఆమె పులిచింతల అధికారులకు గాని ఆర్డీవోకు గాని ఎలాంటి దరఖాస్తు చెయ్యకపోయినా ఆమెకు తెలియకుండా ఆమె సంతకం ఫోర్జరీ చేసి ఎస్సీ కాలనీ నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఓసి కాలనీలోని ప్లాటుకు 779 మార్చడం జరిగిందని,779 ఫ్లాట్ రద్దు చేసి ఆమెకు కేటాయించిన 11వ ఫ్లాటు గుర్తించి ఆమెకు తెలియకుండా ఆమె ప్రమేయం లేకుండా మార్చిన వ్యక్తులపై అందుకు సహకరించిన అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలని మరో బాధితురాలు సోమవారం హుజూర్ నగర్ ఆర్డీవోకు ఫిర్యాదు చేయడంతో ఈ మొత్తం వ్యవహారం హుజూర్ నగర్ ఆర్డీవో ఆఫీస్ కేంద్రంగా జరిగిందనే విషయం అర్థమవుతుంది.
దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.