అగ్నిపత్ వద్దు అంటూ దేశవ్యాప్తంగా యువకులు ఆందోళనలు చేస్తున్నా ప్రధాని నరేంద్రమోడీ మాత్రం అగ్నిపత్ ను కొనసాగించడం కోసమే ప్రయత్నాలు చేస్తున్నాడని అందుకు అనుగుణంగానే నోటిఫికేషన్ కూడా విడుదల చేశాడని ఆయనకు దేశంలో యువకుల అభిప్రాయాలు అవసరం లేదని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావ్ మండిపడ్డాడు. శ్రీలంకలో గౌతమ్ ఆదానికి పవర్ ప్రాజెక్టు ఇప్పించడం వెనుక మోడీ వున్నాడని కేటీఆర్ అన్నాడు.
మోడీ-ఆదాని అవినీతి బంధం గురించి ఇప్పటికే దేశ వ్యాప్తంగా పెద్దగా చర్చలు జరుగుతూనే వున్నాయి.
తాజాగా కేటీఆర్ మాట్లాడుతూ శ్రీలంకలో తమ అవినీతి ఎక్కడ బయట పడుతుందోనని మోడీ అగ్నిపత్ తీసుకొచ్చాడని అన్నారు.
ఈ మేరకు సోమవారం ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.మోడీని యువత అర్తం చేసుకోవడం లేదని మోడీ ఇలా యువకుల్ని నిందిస్తున్నాడా అంటూ కేటీఆర్ ట్విట్టర్ లో ఫైర్ అయ్యాడు.
తమ అవినీతి నుండి దేశ ప్రజల దృష్టిని మళ్ళించెందుకే అగ్నిపత్ తీసుకొచ్చాడని అన్నాడు.అగ్నిపత్ విషయంపై ఇప్పటికే బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న విషయం తెలిసిందే.
సికింద్రాబాద్ కాల్పుల్లో మరణించిన రాకేష్ అంతిమ యాత్రలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అతని కుటుంబానికి రూ.25లక్షలు, కుటుంభంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.మరోవైపు బీజేపీ నేతలు సికింద్రాబాద్ ఘటనకు టీఆర్ఎస్ ప్రభుత్వానిదే బాధ్యత అని.రైల్వేస్టేషన్ లో గొడవలు జరగడానికి వాళ్ళే కారణం అయ్యారని అంటున్నారు.రైల్వేస్టేషన్ లో కాల్పులు జరిపింది రైల్వే పోలీసులు కాదని వాళ్లు తెలంగాణ ప్రభుత్వ పోలీసులే అని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.
మరోవైపు సికింద్రాబాద్ ఘటనలో విధ్వంసానికి మా అబ్బాయికి ఎలాంటి సంబంధం లేదని రాకేష్ తల్లిదండ్రులు చెబుతున్నారు.తమను కేసీఆర్ ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.తమ కుమారులతో పాటు, ఆందోళన చేస్తున్న యువకుల మీద కేంద్ర ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టకుండా చూడాలని కేటీఆర్ ని కోరారు.

ఇప్పటికే చంచల్ గూడ జైల్లో చాలా మంది యువకులను అరెస్ట్ చేసి పెట్టారు.వారిని తక్షణమే విడుదల చేయాలని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.ఈ కేసులో ఇప్పటివరకు 46 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు అగ్నిపత్ కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కు పిలుపునిచ్చారు యువకులు.ఇలాంటి తరుణంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చ అయ్యాయి.







