కాంగ్రెస్ సర్కార్ పై ఫైర్ అయిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని,రాష్ట్రంలో కరువు పరిస్థితులపై సమీక్ష చేసే సోయి ముఖ్యమంత్రి,మంత్రులకు లేకపోయిందని సీఎం రేవంత్ రెడ్డి,మంత్రులపై మాజీమంత్రి,సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు.సోమవారం ప్రసిద్ధ దురాజ్ పల్లి లింగమంతుల గుట్టపై నిర్మించిన కమ్యూనిటీ హల్ ను ఆయన ప్రారంభించారు.

 Former Minister Jagdish Reddy Who Fired On The Congress Government , Congress Go-TeluguStop.com

అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతాంగాన్ని గాలికొదిలేసి, వ్యాపారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసి,ఢిల్లీకి డబ్బు మూటలు పంపుతున్నారని ఆరోపించారు.తక్షణమే రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి,ఆయా జిల్లాల్లో మంత్రులు కరువు మీద సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు.

కర్ణాటక సిఎం, డిఫ్యూటీ సీఎంలతో మాట్లాడి ఆల్మట్టి నుంచి పది టీఎంసీల నీరు విడుదల చేయించాలని సూచించారు.అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube