సూర్యాపేట జిల్లా:తనకున్న 35 కుంటల భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకొని అనేక ఇబ్బందులు పెడుతున్నారని అనంతగిరి మండలం పాలవరం గ్రామానికి చెందిన వీరనాగులు అనే రైతు శుక్రవారం కోదాడ ఆర్డీవో కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిరసన చేపట్టడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఈ సందర్భంగా బాధిత రైతు వీరనాగులు మాట్లడుతూ తనకు న్యాయం చేయాలని ఎన్నిసార్లు రెవిన్యూ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని,ఎవరూ పట్టించుకోవడం లేదని, చివరికి ఆత్మహత్య చేసుకోవడమే మార్గమని భావించి పెట్రోల్ పోసుకొని నిరసన చేస్తున్నానని, తనకు న్యాయం చేయకపోతే చావు ఒక్కటే మార్గమని అవేదన వ్యక్తం చేశారు.