సూర్యాపేట జిల్లా:మునగాల మండల కేంద్రంలోని జాతీయ రహదారి 65 పై అత్యాధునిక సదుపాయం గల ఏఎన్ పీఆర్ (ఆటో నంబర్ ప్లేట్ రికార్డింగ్) సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు ప్రక్రియను జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జాతీయ రహదారులపై ప్రమాదాలు,నేరాల అదుపు,వాహనాల వేగం,నేరాలకు పాల్పడ్డ వాహనాలను గుర్తించడానికి గాను మునగాల వద్ద ఏఎన్ పీఆర్ (ఆటో నంబర్ ప్లేట్ రికార్డింగ్) సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
జిల్లాల్లో ఇలాంటి కెమెరాలు ఎన్ హెచ్ 65 పై సూర్యాపేట పట్టణ పరిధి ఈనాడు ఆఫీస్ జంక్షన్ వద్ద గతంలో ఏర్పాటు చేశామని, ఇప్పుడు మునగాల కేంద్రంలో ప్రంభించామని,త్వరలో అంతరాష్ట్ర సరిహద్దు రామాపురం క్రాస్ రోడ్ వద్ద,జిలా బార్డర్ టేకుమట్ల వద్ద ఏర్పాటు చేస్తామని తెలిపారు.జిల్లాలో వచ్చిపోయే ప్రతి వాహనాన్ని ఈ కెమెరాలు రికార్డ్ చేస్తాయని,హై రిజల్యూషన్ కలిగిన ఆటో రికార్డ్ సిస్టం గల ఈ కెమెరాలు ఆటోమాటిక్ గా వాహనాల యొక్క నంబర్ ప్లేట్ లను,వాహనాల వేగాలను,వాహనాల కంపెనీలను,వాహన డ్రైవర్ లను గుర్తించి రికార్డ్ చేస్తుందన్నారు.
ఏదైనా వాహనం ప్రమాదానికి కారణమైన,నేరాలకు పాల్పడి ఈ మార్గంలో వెళితే అలాంటి వాహనాలను నంబర్ ప్లేట్ ఆధారంగా తేలికగా గుర్తించవచ్చు,అలాగే 80 కి.మీ పైగా వేగంతో వెళుతున్న వాహనాల ను కూడా గుర్తించి నంబర్,వాహన స్థితిగతులు రికార్డ్ చేస్తుందన్నారు.ఇలాంటి అత్యాధునిక కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల రహదారులపై మరింత భద్రత కల్పించడం జరుగుతుందని అన్నారు.నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయని,కావున ప్రజలు,వ్యాపారులు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుకు ముందుకు రావాలి కోరారు.
మునగాల వద్ద సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు తమ వంతుగా సహాయ సహకారాలు అందించిన స్థానిక రైస్ మిల్లర్ల అసోసియేషన్,సహస్త్రా వెంచర్ డవలపర్స్ వారిని,ప్రజలను ఎస్పీ అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రితిరాజ్, డిఎస్పీ ఏ.రఘు,సిఐ ఆంజనేయులు,ఎస్ఐ బాలు నాయక్,స్థానిక సర్పంచ్,పీఏసీఎస్ ఛైర్మెన్, ప్రముఖులు,గ్రామ ప్రజలు,పెద్దలు,ప్రజాప్రతినిధులు, మిల్లర్ల అసోసియేషన్ సభ్యులు,సహస్ట్ర డవలపర్స్ సభ్యులు పాల్గొన్నారు.